వైష్ణవి చైతన్యపై మెగాస్టార్ ప్రశంసలు! వైరల్ అవుతున్న వీడియో!

  • Author ajaykrishna Published - 12:07 PM, Mon - 31 July 23
  • Author ajaykrishna Published - 12:07 PM, Mon - 31 July 23
వైష్ణవి చైతన్యపై మెగాస్టార్ ప్రశంసలు! వైరల్ అవుతున్న వీడియో!

మెగాస్టార్ చిరంజీవిని కలిస్తే చాలు అనుకునేవారు ఎంతోమంది ఉంటారు. అలాంటిది ఆయన్ని కలవడమే కాకుండా.. ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు. విషయం కాదు. ఇండస్ట్రీలో మెగాస్టార్ గౌరవం, ఫ్యాన్స్ లో ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఆయన జస్ట్ చెయ్ ఊపి హాయ్ అంటేనే సంబరపడిపోయే పరిస్థితి చాలామంది సెలబ్రిటీలది. అటువంటిది ఓ యంగ్ హీరోయిన్ చేసిన డెబ్యూ మూవీని ప్రశంసిస్తూ.. ఆమెను కొనియాడారు మెగాస్టార్. ఇటీవల చిన్న సినిమాగా విడుదలై ఊహించని రేంజ్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది బేబీ మూవీ. ఆనంద్ దేవరకొండ, డెబ్యూ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా.. జులై 14న విడుదలై దాదాపు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

ఈ ఒక్క సినిమాతో అటు ఆనంద్ దేవరకొండకి ఫస్ట్ కమర్షియల్ హిట్ లభించగా.. డెబ్యూ హీరోయిన్ గా వైష్ణవి మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటన పరంగా అద్భుతమైన ప్రశంసలు.. అందుకుని హాట్ టాపిక్ గా మారింది. అయితే.. తాజాగా బేబీ మూవీ సక్సెస్ మీట్ కి స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం స్టేజ్ పై బేబీ మూవీ టీమ్ తో పాటు.. హీరోహీరోయిన్స్ ని.. వారి నటనను కొనియాడారు. ముఖ్యంగా హీరోయిన్ వైష్ణవి చైతన్యని చిరు ఆకాశానికి లేపారు. మరోవైపు అటు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ తమ తమ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటనను పండించారని ఆయన అన్నారు.

ఇక ప్రత్యేకంగా వైష్ణవి గురించి మాట్లాడుతూ.. “ఇప్పటిదాకా ఇండస్ట్రీలో సహజనటిగా జయసుధను చూశాం. అటు గ్లామర్ అయినా.. డిగ్లామర్ అయినా ఆమె ఎన్నో ఏళ్లు అద్భుతమైన నటన కనబరిచారు. ఆమె తర్వాత అంత సహజమైన నటి నాకు తారసపడలేదు. కానీ.. చాలా కాలం తర్వాత వైష్ణవిలో మరో సహజనటిని చూసాను. ఈ సినిమాలో అటు గ్లామర్ గా, ఇటు డిగ్లామర్ గా ఆమె చూపించిన వేరియేషన్స్ చక్కగా ఉన్నాయి. వైష్ణవి ఫ్యూచర్ గొప్పగా ఉండబోతుందని నాకు ఇప్పుడే అర్ధమవుతుంది.” అని చిరు ప్రశంసలు కురిపిస్తూ విష్ చేశారు. మరి మెగాస్టార్ నుండి కితాబు అందుకుంటే ఎవరి ఆనందమైనా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం మెగాస్టార్ వైష్ణవి గురించి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బేబీ మూవీని సాయి రాజేష్ తెరకెక్కించగా.. ఎస్.కే.ఎన్ నిర్మించారు. మరి వైష్ణవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments