iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి చిన్నా.. ఎక్కడ? ఎప్పుడంటే..

  • Published Nov 07, 2023 | 9:16 AM Updated Updated Nov 07, 2023 | 9:16 AM

తాజాగా సిద్ధార్థ్‌ తన సొంత బ్యానర్లో తమిళంలో ‘చిత్తా ’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘చిన్నా’గా డబ్‌ అయి రిలీజ్‌ అయింది..

తాజాగా సిద్ధార్థ్‌ తన సొంత బ్యానర్లో తమిళంలో ‘చిత్తా ’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘చిన్నా’గా డబ్‌ అయి రిలీజ్‌ అయింది..

  • Published Nov 07, 2023 | 9:16 AMUpdated Nov 07, 2023 | 9:16 AM
ఓటీటీలోకి చిన్నా.. ఎక్కడ? ఎప్పుడంటే..

మాతృభాష తమిళంలోకంటే.. తెలుగులోనే ఎక్కువ క్రేజ్‌ సంపాదించుకున్నారు హీరో సిద్ధార్థ్‌. ఆయన సినీ కెరీర్‌లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్లుగా నిలిచిన సినిమాలన్నీ తెలుగువే కావటం విశేషం. తమిళంతో సమానంగా ఆయన తెలుగులో చిత్రాలు తీశారు. అయితే, తెలుగులో సరైన హిట్లు రాకపోవటం కారణంగా 2013 తర్వాత ఆయన టాలీవుడ్‌కు కొద్దిగా దూరం అయ్యారు. నేరుగా అరకొర సినిమాలు తీస్తూ వచ్చారు. ఆయన తమిళంలో తీసిన సినిమాలే ఇక్కడ కూడా రిలీజ్‌ అవుతూ వస్తున్నాయి.

తాజాగా సిద్ధార్థ్‌ తన సొంత బ్యానర్లో తమిళంలో ‘చిత్తా ’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా తెలుగులో ‘చిన్నా’గా డబ్‌ అయి రిలీజ్‌ అయింది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం మంచి రివ్యూలు ఇచ్చారు. చిన్నా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి రిలీజై ఘన విజయాన్ని సాధించింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో సత్తా చాటడానికి సిద్ధమైంది.

చిన్నా ఓటీటీ రిలీజ్‌ కన్‌ఫాం అయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉంది. రిలీజ్‌ డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. 11 నుంచి 16 వరకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్‌ అవ్వనుంది. ఇక, చిన్నా ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాడో వేచి చూడాలి.. మరి, థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిన్నా సినిమా ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom