iDreamPost
android-app
ios-app

తాగుబోతు ఆటో డ్రైవర్‌ కారణంగా ప్రముఖ సింగర్‌కు యాక్సిడెంట్‌!

  • Published Oct 04, 2023 | 3:48 PM Updated Updated Oct 04, 2023 | 3:48 PM
  • Published Oct 04, 2023 | 3:48 PMUpdated Oct 04, 2023 | 3:48 PM
తాగుబోతు ఆటో డ్రైవర్‌ కారణంగా ప్రముఖ సింగర్‌కు యాక్సిడెంట్‌!

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద.. కారు ప్రమాదానికి గురైంది. ఓ ఆటో డ్రైవర్‌ తాగి ఆటో నడిపి.. చిన్మయి కారును ఢీకొట్టాడు. ఆ సమయంలో ఆమె కారులో లేరు. ఆమె ఇద్దరు పిల్లలు, ఓ మహిళ మాత్రమే ఉన్నారు. కారు బాగా డ్యామేజ్‌ అయినప్పటికి లోపల ఉన్నవారికి ఏమీ కాలేదు. ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ మేరకు చిన్మయి తన ట్విటర్‌ ఖాతాలో ఆదివారం ఓ పోస్టు పెట్టారు. ఆటో డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టులో.. ‘‘ ఓ తాగుబోతు ఆటో డ్రైవర్‌ మా కారును ఢీకొట్టాడు. ఎడమ వైపు కారు భాగం బాగా పాడైంది.

ఆ సమయంలో నా ఇద్దరు పిల్లలు ముందు సీటులో కూర్చుని ఉన్నారు. దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డారు. నేను పనిలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. కారు దగ్గరకు వచ్చి చూస్తే గానీ, ఎంత పెద్ద ప్రమాదమో అర్థం కాలేదు. మేము తరచుగా కూరగాయాలు కొనే వ్యక్తి మాకు సాయం చేయటానికి వచ్చాడు. ఓ వ్యక్తి తన కారుతో ఆ తాగుబోతు ఆటో డ్రైవర్‌ను పట్టుకోవటానికి బాగా ప్రయత్నించాడు. అయినా, ఆ ఆటో డ్రైవర్‌ చిక్కలేదు. నేను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకోవటం లేదు.

ఎందుకంటే చేసి ప్రయోజనం లేదు. నా పిల్లలు క్షేమంగా బయటపడ్డందుకు సంతోషిస్తున్నాను. అది చాలు. తాగి వాహనాలు నడిపే వాళ్ల చేతులు విరిగిపోవాలి. తల్లిదండ్రులుగా ఇది మా బాధ. దయచేసి తాగి వాహనాలు నడపద్దు’’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నారు. మరి, ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద కారు ప్రమాదానికి గురికావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet