iDreamPost
android-app
ios-app

మహిళపై భర్త దాడి.. షాకింగ్‌ స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసిన చిన్మయి!

  • Published Jul 19, 2023 | 8:32 AM Updated Updated Jul 19, 2023 | 8:32 AM
  • Published Jul 19, 2023 | 8:32 AMUpdated Jul 19, 2023 | 8:32 AM
మహిళపై భర్త దాడి.. షాకింగ్‌ స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసిన చిన్మయి!

ప్రముఖ సింగర్‌ చిన్మయి మహిళలపై జరుగుతున్న దారుణాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. తన దృష్టికి వచ్చిన ఆడవాళ్ల సమస్యలపై గట్టిగా తన స్వరం వినిపిస్తూ ఉంటారు. తరచుగా ఏదో ఒక పోస్టుతో జనాలను పలకరిస్తూ ఉంటారు. తాజాగా, ఆమె ఓ మహిళకు సంబంధించిన షాకింగ్‌ స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేశారు. ఆ పోస్టులో ఓ మహిళ తన భర్త కారణంగా తాను ఎదుర్కొంటున్న నరకాన్ని చెప్పుకొచ్చింది. తన భర్త దాడి చేయటం కారణంగా అయిన గాయాలను సైతం ఫొటోలు తీసి చిన్మయికి పంపంది.

ఆ మహిళ ఈ విధంగా రాసుకొచ్చింది. ‘‘ గత వారం నా భర్త నన్ను దారుణంగా కొట్టాడు. ఇలా ఆయన నన్ను కొట్టడం కొత్తేమీ కాదు. దాదాపు ఓ సంవత్సర కాలంగా జరుగుతోంది. నన్ను బూతులు కూడా తిడుతున్నాడు. నన్ను ఎప్పుడూ ఓ పని చేసే యంత్రం లాగా చూస్తాడు. నేను దీన్నుంచి ఎలా బయటపడగలను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను చిన్మయి తన ఖాతాలో షేర్‌ చేశారు. ఆ పోస్టులో.. ‘‘ 2023లో కూడా భర్తలు భార్యలపై దాడి చేసినపుడు అడగటానికి నాలాంటి వాళ్లు కచ్చితంగా ఉండాలి.

అందరూ ఫెమినిజం గురించి, మహిళా సాధికారత గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి నరక కూపాల నుంచి మహిళలు బయటపడటానికి వారికి స్వేచ్ఛ లేదు.. ఆర్థిక స్వాతంత్రం లేదు’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తూ ఉన్నారు. కొందరు చిన్మయిని సపోర్టు చేస్తుంటే.. మరికొందరు తప్పు బడుతున్నారు. మరి, చిన్మయి షేర్‌ చేసిన షాకింగ్‌ స్క్రీన్‌ షాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş