iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి గుర్తుందా.. హీరోయిన్ గా తెలుగులో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్సే!

  • Author ajaykrishna Published - 06:19 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 06:19 PM, Mon - 10 July 23
ఈ చిన్నారి గుర్తుందా.. హీరోయిన్ గా తెలుగులో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్సే!

ఇండస్ట్రీలోకి కొంతమంది హీరోయిన్స్ వచ్చిన వెంటనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంటారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే వచ్చిన సూపర్ క్రేజ్ ని సరిగ్గా వాడుకొని స్టార్స్ అయిపోతారు. మరికొందరు క్రేజ్ వచ్చినా.. సరైన కథలు ఎంపిక చేసుకోలేక ప్లాప్స్ అందుకుంటారు. ఆ ఇంకా ఉంటారేమోలే.. అనుకునే లోపల దుకాణం సర్దుతారు. కానీ.. కొందరు మాత్రం డెబ్యూ మూవీతో సూపర్ క్రేజ్ వచ్చినా.. దాని వెనుక అవకాశాలు వెల్లువెత్తినా.. చెప్పా పెట్టకుండా మకాం మార్చేస్తారు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న ముద్దుగుమ్మ ఆ కోవకే చెందుతుంది. తెలుగులో చేసింది రెండంటే రెండే సినిమాలు.

ఆ రెండు సినిమాలు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అలాగే అవకాశాలు కూడా.. వచ్చాయి. కానీ.. ఈ వయ్యారి అవకాశాలు అన్ని వదులుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. మొత్తానికి మకాం అక్కడికే మార్చేసింది. ఆమెను చూస్తే.. ఖచ్చితంగా ఇంకొన్ని సినిమాలు తెలుగులో చేయాల్సింది అనిపిస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయినా.. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. కానీ.. వెళ్ళిపోయినా రెండు సూపర్ హిట్స్ చేసి పోయింది. ఇదంతా జరిగి ఇరవై మూడేళ్లకు పైనే అవుతోంది. కెరీర్ ఫస్ట్ మూవీనే లెజెండ్ మణిరత్నం దర్శకత్వంలో చేసింది. ఈ సొట్టబుగ్గల సుందరి.

సొట్టబుగ్గల సుందరి అనగానే ఆమె ఎవరో గుర్తొచ్చి ఉండాలి.. అయినా రాలేదా పర్లేదు ఇంకో క్లూ ఇస్తా. మొదటి సినిమాలో.. నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా అంటూ అద్భుతమైన పాటతో ఆకట్టుకుంది. ఛలో.. ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఈ భామ ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ ప్రీతి జింటా. దిల్ సే మూవీతో డెబ్యూ చేసిన ఈ వయ్యారి.. తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కానీ.. ఆ తర్వాత కనీసం తెలుగు వైపు కన్నెత్తి కూడా చూడకుండా బాలీవుడ్ కి పరిమితమైంది. కట్ చేస్తే.. ఈ సిమ్లా ఆపిల్.. 2016లో జీన్ గుడ్ ఎనఫ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటినుండి మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రీతికి సంబంధించి ఈ చిన్నప్పటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin