iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? తెలుగులో అన్ని సూపర్ హిట్ సినిమాలే చేసింది!

  • Author ajaykrishna Updated - 12:57 PM, Mon - 11 December 23

అదే వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి చాలా అరుదుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎంతో అందంగా స్టార్డమ్ అనుభవిస్తున్న అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనేది ఆసక్తి కలిగించే విషయమే.

అదే వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి చాలా అరుదుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎంతో అందంగా స్టార్డమ్ అనుభవిస్తున్న అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనేది ఆసక్తి కలిగించే విషయమే.

  • Author ajaykrishna Updated - 12:57 PM, Mon - 11 December 23
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? తెలుగులో అన్ని సూపర్ హిట్ సినిమాలే చేసింది!

ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా ఫ్యాన్స్ కి కనువిందుగానే అనిపిస్తుంది. మూవీ అప్డేట్స్ ఎప్పుడూ ఉండేవే. అదే వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి చాలా అరుదుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎంతో అందంగా స్టార్డమ్ అనుభవిస్తున్న అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారు అనేది ఆసక్తి కలిగించే విషయమే. మీరు పైన ఫోటోలో ముద్దుగా కనిపిస్తున్న చిన్నారిని గమనించారా? ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ అనుభవించి.. మంచి హిట్ సినిమాలు చేసింది. ఫోటోలో చూస్తే పెద్దగా పోలికలు కనిపించడం లేదా? అయితే మీకో క్లూ ఇస్తా.. ఈ పాప తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో స్టార్స్ సరసన మూవీస్ చేసింది.

అదీగాక ఆమె చేసిన అన్ని భాషల్లో సూపర్ హిట్స్ కూడా ఖాతాలో వేసుకుంది. కానీ.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని.. వివాహ బంధానికి పరిమితం అయిపోయింది. ఇప్పుడైనా గుర్తొచ్చిందా లేక ఇచ్చిన క్లూస్ పిక్ కంటే హార్డ్ గా ఉన్నట్లు అనిపిస్తున్నాయా.. సరే ఇప్పుడు చెప్పేస్తా.. తెలుగులో మాస్ రాజా రవితేజ మూవీతో డెబ్యూ చేసింది. ఎస్.. అందులో ఓయ్ చెన్నై! అని పిలుస్తాడు హీరో. ఇప్పుడు తెలిసిపోయిందా ఎవరో. ఆ బ్యూటీ తానే అసిన్. అమ్మానాన్న తమిళమ్మాయి మూవీతో తెలుగులో డెబ్యూ చేయడమే కాకుండా.. ఫస్ట్ హిట్ అందుకుంది. ఆ తర్వాత శివమణి, లక్ష్మీనరసింహ, ఘర్షణ.. ఇలా వరుస హిట్స్ తో ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.

అదే వరుసలో తమిళంలో అవకాశాలు వచ్చేసరికి అమ్మడు చెన్నైకి మకాం మార్చేసింది. అక్కడ స్టార్స్ తో నటిస్తూనే.. తెలుగులో డార్లింగ్ ప్రభాస్ సరసన చక్రం, పవన్ కళ్యాణ్ తో అన్నవరం మూవీస్ చేసి.. పూర్తిగా నార్త్ పై ఫోకస్ పెట్టింది. అంతే.. బాలీవుడ్ లోను అసిన్ కి పట్టిందే బంగారం అన్నట్లు అవకాశాలు వచ్చాయి. కానీ.. ఏది పడితే అది ఒప్పుకోకుండా తనకు నచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళింది. అసిన్ లో ఫ్యాన్స్ కి నచ్చే విషయం ఏంటంటే.. ఆమె ఎప్పుడు ఏ భాషలో సినిమాలు చేసినా.. ఎక్స్ పోజింగ్ కి ఛాన్స్ ఇవ్వలేదు. కెరీర్ పరంగా బిజీ ఉన్నప్పుడు 2016లో రాహుల్ శర్మ అనే వ్యక్తిని పెళ్లాడింది. అప్పటినుండి మూవీస్ కి దూరంగా ఉంటోంది. అయితే.. తాజాగా అసిన్ కి సంబంధించి ఈ చిన్ననాటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ హోమ్లీ బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom