iDreamPost
android-app
ios-app

‘రాక్షసుడు’లో సూర్య కూతురిగా నటించిన పాప.. హీరోయిన్ల కంటే అందంగా..

  • Published Feb 10, 2024 | 3:27 PM Updated Updated Feb 10, 2024 | 3:27 PM

చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన అమ్మాయిలు.. రెండు మూడేళ్లలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి రాబోతుంది మరో కుట్టి. రాక్షసుడు మూవీలో సూర్య కూతురిగా నటించిన పాప గుర్తుంది కదా.. ఇప్పుడు చూస్తే..

చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన అమ్మాయిలు.. రెండు మూడేళ్లలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోకి రాబోతుంది మరో కుట్టి. రాక్షసుడు మూవీలో సూర్య కూతురిగా నటించిన పాప గుర్తుంది కదా.. ఇప్పుడు చూస్తే..

  • Published Feb 10, 2024 | 3:27 PMUpdated Feb 10, 2024 | 3:27 PM
‘రాక్షసుడు’లో సూర్య కూతురిగా నటించిన పాప..  హీరోయిన్ల కంటే అందంగా..

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన వారు.. ఇలా చూస్తుండగానే.. అలా పెరిగి పోయి.. హీరో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బాల నటీమణులు. చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేస్తుండగానే.. సడెన్‌గా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ.. అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తున్నారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో ఆనందిగా అందరి హృదయాలను కొల్లగొట్టిన అవికా గోర్.. ఈ ధారావాహిక టీవీల్లో వస్తుండగానే.. వెండితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అలాగే దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురిగా కనిపించిన ఎస్తేర్ అనిల్, అనికా సురేంద్రన్ ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించి.. ఇప్పుడు హీరోయిన్లుగా ప్రమోట్ అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది మరో కుట్టి.

సూర్య తమిళ నటుడు అయినప్పటికీ..తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. నిజం చెప్పాలంటే రజనీ, కమల్ తర్వాత వారి నట వారసుడిగా చూస్తారు ఇక్కడి ఫ్యాన్స్. పితామగన్ (శివ పుత్రుడు), యువతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. టాలీవుడ్ నాట కూడా స్టార్ డమ్ తెచ్చిన చిత్రం గజిని. ఆరు, నువ్వు నేను ప్రేమ, సింగం, సెవన్త్ సెన్స్ వంటి చిత్రాలతో మరింత దగ్గరయ్యాడు. విలక్షణ నటుడిగా.. సినిమా.. సినిమాకు వేరియషన్ చూపిస్తుంటారు. అలాంటి చిత్రాల్లో ఒకటి రాక్షసుడు. మాస్ ఎంగిర మసిలామణి తమిళ డబ్బింగ్ చిత్రమిది. ఇందులో నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో సూర్య కూతురిగా నటించిన పాప గుర్తుంది కదా.. ఆ అమ్మాయి ఇప్పుడు బుట్టబొమ్మలా మారిపోయింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతుంది.

ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. యువినా పార్థవి. చైల్డ్ ఆర్టిస్టుగా సీరియళ్ల ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన ఈ పాప.. అజిత్ వీరం, విజయ్ దళపతి కత్తితో పాటు అనేక చిత్రాల్లో బాల నటిగా అలరించింది. ఇప్పుడు పెద్దదై.. హీరోయిన్ మెటీరియల్‌ గా మారిపోయింది. తమిళంలోనే కాకుండా కన్నడ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసిన ఈ పాప.. ఇప్పుడు జయం రవి సినిమాలో కనిపించబోతుంది. చిన్నప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు నాజుగ్గా తయారైంది. యువినా ప్రస్తుతం సైరన్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు నూతన దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్. కీర్తి సురేష్ హీరోయిన్. ఈనెల 19న థియేటర్లలో సైరన్ మూవీ సందడి చేయనుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş