iDreamPost
android-app
ios-app

‘అతడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అర్జున్ రెడ్డి రేంజ్ సినిమాతో హీరోగా!

  • Published Jan 24, 2024 | 3:24 PM Updated Updated Jan 24, 2024 | 3:24 PM

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు తర్వాత హీరో, హీరోయిన్లు గా మారి స్టార్ రేంజ్ కి ఎదిగిన వారు ఉన్నారు. తెలుగు లో మహేష్ బాబు, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఇలా ఎంతో మంది బాాల నటులుగా కెరీర్ ఆరంభించినవారే..

సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారు తర్వాత హీరో, హీరోయిన్లు గా మారి స్టార్ రేంజ్ కి ఎదిగిన వారు ఉన్నారు. తెలుగు లో మహేష్ బాబు, తమిళంలో కమల్ హాసన్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఇలా ఎంతో మంది బాాల నటులుగా కెరీర్ ఆరంభించినవారే..

  • Published Jan 24, 2024 | 3:24 PMUpdated Jan 24, 2024 | 3:24 PM
‘అతడు’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అర్జున్ రెడ్డి రేంజ్ సినిమాతో హీరోగా!

సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యా హీరో, హరోయిన్స్ గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి అక్కినేని అఖిల్ వరకు చైల్డ్ ఆర్టిస్టు గా నటించినవారే. టాలీవుడ్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక నటీనటులుగా కెరీర్ కొనసాగించారు.. కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. ఇటీవల రిలీజ్ అయిన బలగం మూవీలో నటించిన కావ్య హీరోయిన్ గా వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. చిరంజీవి నటించిన ఇంద్ర, చూడాలని ఉంది మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్టు గా నటించిన తేజ సజ్జా ఇటీవల రిలీజ్ అయిన హనుమాన్ మూవీతో నేషనల్ స్టార్ గా మారాడు. వీరి బాటలోనే ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగాన తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు.. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఫుల్ మీల్స్ భోజనంలా ఉంటుంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ థియేటర్లో పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటారు. అతడు మూవీలో బ్రహ్మానందం కొడుకుగా నటించాడు దీపక్ సరోజ్. మా నాన్న పొట్ట చూడరోయ్.. స్కూల్ బేంజ్ లా ఎంత గట్టిగా ఉందో అంటూ బ్రహ్మనందం పొట్టపై కొట్టే సీన్ గుర్తుంది కదా.. ఈ సీన్ తో పాటు చాలా సీన్లలో దీపక్ సరోజ్ కనిపిస్తాడు. తర్వాత పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా దీపక్ నటించాడు. ప్రస్తుతం దీపక్ సరోజ్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇవ్వతున్నాడు.

టాలీవుడ్ లో ఇటీవల నూతన దర్శకులు తమ ప్రతిభ నిరూపించుకుంటూ మంచి హిట్ సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ యశస్వి దర్శకత్వంలో ‘సిద్దార్ధ్ రాయ్’  తెరకెక్కుతుంది. ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు దీపక్ సరోజ్. నిన్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీ గుర్తుకు వస్తుంది. ఎమెషన్స్, బోల్డ్ సీన్స్, ఆటిట్యూడ్ అన్నీ ఓ రేంజ్ లో చూపించారు. మొత్తానికి సైలెంట్ గా ఉండి.. అర్జున్ రెడ్డి రేంజ్ లో ఎంట్రీ ఇస్తున్న దీపక్ సరోజ్ కెరీర్ లో సక్సెస్ సాధిస్తాడా? లేదా? చూడాలి. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabetEscortes Belgique