iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడు మృతి

  • Published Apr 11, 2024 | 1:34 PM Updated Updated Apr 11, 2024 | 1:34 PM

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. డేనియల్ బాలాజీ, ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు మరణాలు మర్చిపోక ముందే ఇప్పుడు ఓ విలన్ మృత్యువాత పడ్డాడు.

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. డేనియల్ బాలాజీ, ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీర భద్రరావు మరణాలు మర్చిపోక ముందే ఇప్పుడు ఓ విలన్ మృత్యువాత పడ్డాడు.

  • Published Apr 11, 2024 | 1:34 PMUpdated Apr 11, 2024 | 1:34 PM
ఇండస్ట్రీలో విషాదం.. నిశ్చితార్థం రోజే నటుడు మృతి

ఇండస్ట్రీని విషాదాలు వీడటం లేదు. బాలీవుడ్ మొదలుకుని మాలీవుడ్ వరకు సినీ సెలబ్రిటీలు, టెక్నీషియన్లు మృత్యువాత పడుతున్నారు. వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది గుండె పోటుకు, అనారోగ్య సమస్యలతో, ప్రమాదాల వల్ల మరణిస్తున్నారు. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వర రావు, క్యారెక్టర్ ఆర్టిస్టు వీర భద్రరావు గత నెలలో కన్నుమూసిన సంగతి విదితమే. అలాగే డబ్బింగ్ రచయిత శ్రీ రామకృష్ణ, అంతకు ముందు మరో హాస్య నటుడు లక్ష్మీ నారాయణన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్ విలన్ డేనియల్ బాలాజీ కూడా చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. తాజాగా బాలీవుడ్ నిర్మాత గంగూ రామ్ సే అనారోగ్య సమస్యలతో మరణించారు.

ఉగాది పండుగ నాడు రోడ్డు ప్రమాదానికి గురై మాలీవుడ్ నటుడు సుజిత్ రాజేంద్రన్ అనే నటుడు మరణిించాడు. తాజాగా మరో నటుడు మృత్యువాత పడ్డాడు. అయితే పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో.. శ్మశాన వాటికకు తరలివెళ్లాడు. ఛత్తీస్‌గఢ్  ప్రముఖ నటుడు కమ్ విలన్ సూరజ్ మోహర్ మరణించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒడిశాలో అతడికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఆ వేడుకకు వెళ్లాల్సి ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూరజ్ చనిపోయినట్లు నిర్ధారించారు.

The actor died on the day of engagement

ఈ ఘటనలో సూరజ్ మెహర్ సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అతడి మరణ వార్త విని చత్తీస్ గఢ్ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. 40 ఏళ్ల సూరజ్‌కు.. ఒడిశాలోని భథాలీలో గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది. బుధవారం అర్థరాత్రి ఆఖ్రీ ఫైస్లా సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అంతలో ఊహించని విధంగా ప్రమాదం అతడ్ని తీసుకెళ్లిపోయింది. ఆయన స్కార్పియో వాహనం బిలాయి గఢ్‌లోని సర్పివా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అతడి మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంట్లో శుభకార్యం జరగాల్సిన నాడే.. అతడు మృత్యువాత పడ్డాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş