iDreamPost
android-app
ios-app

షూటింగ్ సెట్ లోకి చిరుతపులి! భయంతో పరుగులు తీసిన నటీనటులు!

  • Author ajaykrishna Updated - 11:53 AM, Thu - 27 July 23
  • Author ajaykrishna Updated - 11:53 AM, Thu - 27 July 23
షూటింగ్ సెట్ లోకి చిరుతపులి! భయంతో పరుగులు తీసిన నటీనటులు!

సినిమా షూటింగ్స్ లో అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే సంఘటనలు జరుగుతుంటాయి. ప్రమాదాల గురించి కాదు. కొన్నిసార్లు షూటింగ్ సెట్స్ లోకి పాము వచ్చిందని.. లేదా ఇంకేదో వచ్చిందని వింటుంటాం. అలాంటిదే కొత్తగా ఓ షూటింగ్ సెట్ లో జరిగింది. ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా.. సెట్ లోకి ఏకంగా చిరుతపులి ఎంట్రీ ఇచ్చింది. అదికూడా దాని పిల్లలతో సహా సెట్ లోకి ప్రవేశించే సరికి.. దాదాపు సెట్ లో ఉన్న 200 మంది సిబ్బంది అక్కడినుండి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలుసా.. ముంబై ఫిల్మ్ సిటీలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఓ టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. దాదాపు 200 మందికి పైగా ఆ షూటింగ్ సెట్ లో పాల్గొన్నారు. దీంతో సీరియస్ గా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. చిరుత పులి తన పిల్లలతో వచ్చేసరికి.. నటీనటులతో పాటు టెక్నీషియన్స్, సిబ్బంది అంతా పరారి అయిపోయారు. ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా స్పందించారు. గత పది రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి అని ఆయన చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. పులుల భయంతో షూటింగ్స్ కి బ్రేక్స్ పడటమే కాకుండా ప్రాణాపాయ పరిస్థితి కూడా నెలకొందని అంటున్నారు. మరి షూటింగ్స్ లో జరిగే ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş