iDreamPost
android-app
ios-app

చెగువేరా బయోపిక్.. చే మూవీ ట్రైలర్ చూశారా?

  • Author Soma Sekhar Updated - 01:40 PM, Mon - 13 November 23

'చే'మూవీ.. క్యూబా పోరాటయోధుడు చెగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందిన మూవీ 'చే'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

'చే'మూవీ.. క్యూబా పోరాటయోధుడు చెగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందిన మూవీ 'చే'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

  • Author Soma Sekhar Updated - 01:40 PM, Mon - 13 November 23
చెగువేరా బయోపిక్.. చే మూవీ ట్రైలర్ చూశారా?

వెండితెరపై ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలు ఆవిష్కృతం అయ్యాయి. సినిమా, రాజకీయ, క్రీడా ఇతర రంగాలకు చెందిన ముఖ్యుల జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇదే లిస్ట్ లో చేరబోతోంది ‘చే’మూవీ. క్యూబా పోరాటయోధుడు చెగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందిన మూవీ ఇది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘చే’ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. కాగా.. విడుదలైన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. క్యూబా తర్వాత ప్రపంచంలోనే తొలిసారి ఇండియన్ సినిమా చరిత్రలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది.

క్యూబా వేగుచుక్క, పోరాట యోధుడు చెగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘చే’. నవ ఉదయ సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బీఆర్ సభావత్ నాయకు టైటిల్ రోల్ పోషిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పీడిత ప్రజల తరఫున పోరాడే యోధుడిగా చే పాత్రలో అద్భుతంగా నటించాడు సభావత్ నాయక్. గెలిస్తే న్యాయం చేస్తా.. ఓడితే సహాయం చేస్తా లాంటి డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

ఇక ఈ మూవీలో లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని త్వరలోనే సెన్సార్ కు వెళ్లనుంది చే మూవీ. కాగా.. ఇటీవలే చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా చే మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ తొలి వారంలో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు మేకర్స్. మరి చే మూవీ ట్రైలర్ ఎలాఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom