iDreamPost
android-app
ios-app

అక్కడ పుష్ప 2 కు పోటీగా మరో మూవీ.. ఇలా అయితే రిస్క్ తప్పదు..

  • Published Nov 01, 2024 | 3:30 PM Updated Updated Nov 01, 2024 | 3:30 PM

పుష్ప సినిమాకు అన్ని కలిసి వస్తున్నాయని.. తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు. ఈ సినిమాతో పోటీగా ఇప్పటివరకు మరే సినిమా రాలేదు. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్ లో పుష్ప కు పోటీగా మరో మూవీ నేమ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

పుష్ప సినిమాకు అన్ని కలిసి వస్తున్నాయని.. తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు. ఈ సినిమాతో పోటీగా ఇప్పటివరకు మరే సినిమా రాలేదు. కానీ ఇప్పుడు నార్త్ బెల్ట్ లో పుష్ప కు పోటీగా మరో మూవీ నేమ్ వినిపిస్తుంది. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 01, 2024 | 3:30 PMUpdated Nov 01, 2024 | 3:30 PM
అక్కడ పుష్ప 2 కు పోటీగా మరో మూవీ.. ఇలా  అయితే రిస్క్ తప్పదు..

మొదటి నుంచి కూడా దేవర బాటలో పుష్ప అంటూ బజ్ నడుస్తూనే ఉంది. దేవర సీన్ లోకి దిగితే వార్ వన్ సైడ్ అన్నారు. తీరా చివరికి అదే జరిగింది. ఆ సినిమాకు పోటీగా ఎక్కడా కూడా మరే సినిమాలు రిలీజ్ అవ్వలేదు. అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఇప్పుడు సేమ్ పుష్ప సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. పుష్ప లాంటి ఊరమాస్ హిట్ మూవీ కి ఏ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుందో తెలియనిది కాదు. రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా  అంతా పుష్ప మూవీ థీమ్ తోనే నిండిపోయి ఉంది. ఇంత చూసిన తర్వాత కూడా ఈ సినిమాకు పోటీగా ఇంకో సినిమాని అయితే రిలీజ్ చేయరు. సౌత్ లో అసలు రిలీజ్ చేయరు. ఇప్పటివరకు మరెక్కడా కూడా పుష్ప పోటీగా రిలీజ్ చేసే సినిమాల గురించి టాక్ రాలేదు. కానీ నార్త్ బెల్ట్ లో మాత్రం ఇప్పుడు ఓ సినిమా పేరు వినిపిస్తుంది.

ఆ సినిమా మరేదో కాదు హిందీ మూవీ చావా. ఈ సినిమా కంటెంట్ కు నార్త్ లో మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. కాబట్టి 1000 కోట్ల ప్రీ రిలీజ్ జరిగినా కూడా నార్త్ లో పుష్ప 2 కు కాస్త కష్టమని అంటున్నారు. నార్త్ లో డివోషనల్ గా కానీ , జమానా కాలం నాటి యుద్ధం లాంటి సీన్స్ వస్తే దానికి ఛత్రపతి శివాజీ కనెక్షన్ ఉంటె .. ఇక అది సినీ సునామీనే. చక్రవర్తి ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు ఛత్రపతి శంభాజీ బయో పిక్ గా వస్తుంది చావా. ఇప్పటివరకు వచ్చిన టీజర్ , ట్రైలర్ గట్టిగానే పేలింది. నార్త్ లో ఇలాంటి సినిమాలకు బాగా క్రేజ్ ఉంటుంది. సినిమాలో ఏ మాత్రం డివోషనల్ టచ్ ఇచ్చినా నార్త్ మూవీ లవర్స్ ఊగిపోతూ ఉంటారు. సో అక్కడ ఏ మాత్రం ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కానీ.. పుష్ప కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కానీ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్. ఒకేవేళ దేనికదే అనుకుంటే మాత్రం రెండు హిట్ కొట్టే ఛాన్స్ ఉన్నాయి. సౌత్ పుష్ప రాజ్ సోలోగా రూల్ చేసినా కానీ నార్త్ లో మాత్రం రిస్క్ తప్పేలా లేదు.

పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న రిలీజ్ చేస్తుంటే.. చావా సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అదే కనుక జరిగితే నార్త్ బెల్ట్ లో పుష్ప 2 కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశం కూడా ఉంది. ఇక ఈ రెండు రిలీజ్ అయితే కానీ ఈ లెక్కలు తేలవు. ప్రస్తుతం పుష్ప 2 టీం మాత్రం.. మూవీ ప్రమోషన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా మీద హైప్ పెంచుతూనే ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ కు కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఈలోపు ట్రైలర్ , మిగిలిన సాంగ్స్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే.. సినిమా మీద ఇప్పటివరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నార్త్ లో పుష్ప 2 vs చావా ఎలాంటి రిజల్ట్ ను తెచ్చిపెడుతుందో చూడాలి.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş