iDreamPost
android-app
ios-app

ఛార్మీ ఇంట్లో విషాదం.. లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ఎమోషనల్ పోస్ట్

  • Published Feb 20, 2024 | 10:29 AM Updated Updated Feb 20, 2024 | 10:29 AM

ఛార్మీ కౌర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది.

ఛార్మీ కౌర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది.

  • Published Feb 20, 2024 | 10:29 AMUpdated Feb 20, 2024 | 10:29 AM
ఛార్మీ ఇంట్లో విషాదం.. లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమంటూ ఎమోషనల్ పోస్ట్

హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటి ఛార్మీ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రస్తుతం యాక్టింగ్ కు దూరముంటున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలు నిర్మించే పనిలో నిమగ్నమై పోయింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాతగా రాణిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన లైగర్ మూవీ అనుకున్న స్థాయిలో రాణించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. దీంతో కాస్త నిరాశ చెందిన వీరు మళ్లీ డబుల్ ఇస్మార్ట్ మూవీతో కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరెకెక్కుతున్న ఈ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు ఛార్మీ. కాగా తాజాగా ఛార్మీ ఇంట్లో విషాదం నెలకొంది. దీనికి సంబంధించి ఛార్మీ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఛార్మీ తనకు అత్యంత ఇష్టమైన బంధువును కోల్పోయారు. తన అంకుల్ తో అనుబంధాన్ని తెలుపుతూ.. ఆయన మరణంతో తన హృదయం ముక్కలైందంటూ ఎమోషనల్ కు గురైంది ఛార్మీ. జీవితం నీటి బుడగ లాంటిది.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అంటూ భావోద్వేగానికి లోనైంది. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే కక్కీ అంకుల్ ఇలా సడెన్ గా మరణించడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. నాకు ఇప్పటికే షాకింగ్ గానే ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటానంటూ తన అంకుల్ తో ఉన్న అనుబంధాన్ని తెలిపే ఫోటోను షేర్ చేసింది ఛార్మీ. పింకీ పిన్నీ, స్వీడేల్, నైసీ, కెన్నీ మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మీకోసం ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను అంటూ సోషల్ మీడియా పేజీలో రాసుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş