iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. చార్లీ చాప్లిన్ కూతురు, నటి జోసఫిన్ కన్నుమూత

  • Author ajaykrishna Published - 12:27 PM, Sat - 22 July 23
  • Author ajaykrishna Published - 12:27 PM, Sat - 22 July 23
ఇండస్ట్రీలో విషాదం.. చార్లీ చాప్లిన్ కూతురు, నటి జోసఫిన్ కన్నుమూత

చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు ప్రేక్షకులను దుఃఖంలో ముంచేస్తున్నాయి. ఇటీవల కన్నుమూసిన సినీ ప్రముఖుల మరణవార్తలను మరువక ముందే తాజాగా మరో విషాద వార్త కుదిపేసింది. వరల్డ్ వైడ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లో లెజెండ్ గా పేరొందిన కమెడియన్ చార్లీ చాప్లిన్ గురించి పరిచయం అక్కర్లేదు. కొన్ని దశాబ్దాలపాటు తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా చార్లీ చాప్లిన్ కుమార్తె, నటి జోసెఫిన్ చాప్లిన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు. కాగా.. వయసు మీద పడటంతో అనారోగ్యానికి గురై మరణించినట్లు హాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ వెరైటీ అందించిన సమాచారం ప్రకారం.. జోసఫిన్ చాప్లిన్ జులై 13న పారీస్ లో మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారట. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో 1949 మార్చి 28న జన్మించిన జోసెఫిన్ చాప్లిన్.. చార్లీ చాప్లిన్ కి మూడవ సంతానం. అయితే.. అప్పటికే చాప్లిన్ సినీ రంగంలో స్థిరపడిపోయేసరికి జోసఫిన్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేసింది. 1952లో ‘లైమ్ లైట్’ అనే సినిమాతో చిన్న వయసులోనే సినీ కెరీర్ ప్రారంభించింది. జోసఫిన్ కి ముగ్గురు కొడుకులు. కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసిన జోసఫిన్.. 1972లో ‘ది కాంటర్‌బరీ టేల్స్’, ‘లోడర్ డెస్ ఫావ్స్’, ‘ఎస్కేప్ టు ది సన్‌పెట్ సోనింగ్వీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సోనింగ్వీ’ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ప్రస్తుతం జోసఫిన్ మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetparktimebetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetlunabetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş