Venkateswarlu
థియేటర్లలో విడుదలై అంతగా ప్రేక్షకాధరణ పొందకపోయినా.. ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. తాజాగా, కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కిన ‘‘ఛాంగురే బంగారురాజా’’
థియేటర్లలో విడుదలై అంతగా ప్రేక్షకాధరణ పొందకపోయినా.. ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. తాజాగా, కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కిన ‘‘ఛాంగురే బంగారురాజా’’
Venkateswarlu
చిన్న సినిమాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు మంచి వేదికలుగా మారాయి. థియేటర్లు దొరకుతాయా? లేదా? అన్న ఆలోచన లేకుండా.. ప్రేక్షకులను చేరుకోవటానికి చాలా చక్కగా ఉపయోపడుతున్నాయి. చిన్న సినిమాల మేకర్లు ఓటీటీని దృష్టిలో పెట్టుకునే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఓటీటీ లాభసాటి మార్కెట్‌గా కూడా తయారైంది. ఓటీటీ ప్రేక్షకులు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని చూడకుండా.. మంచి కథ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీరోజు పదుల సంఖ్యలో చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.
థియేటర్లలో విడుదలై అంతగా ప్రేక్షకాధరణ పొందకపోయినా.. ఓటీటీలో రచ్చ చేస్తున్నాయి. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. తాజాగా, కార్తీక్ రత్నం హీరోగా తెరకెక్కిన ‘‘ఛాంగురే బంగారురాజా’’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఛాంగురే బంగారురాజా విషయానికి వస్తే.. ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. సునీల్, రవిబాబు, అజయ్, రాజశేఖర్ అనింగి, నిత్య శ్రీ, ఎస్టర్ నోరోన్హా తదితరులు నటించారు.
రవితేజ నిర్మాతగా వ్యవహిరంచారు. సెప్టెంబర్ 15 ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో సినిమాకు రెస్పాన్స్ రాలేదు. కానీ, విమర్శకులను మాత్రం మెప్పించింది. ఓ హత్య కేసు బైక్ మెకానిక్ జీవితాన్ని ఏ విధంగా మార్చేసిందో అదే ఈ సినిమా కథ. మరి, ఛాంగురే బంగారురాజా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.