iDreamPost
android-app
ios-app

Chandu Sai: జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి చందు సాయి ఎమోషనల్ వర్డ్స్

  • Published Feb 23, 2024 | 3:01 PM Updated Updated Feb 23, 2024 | 5:47 PM

అత్యాచారం, మోసం కేసులో అరెస్టైన చందు సాయి తాజాగా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

అత్యాచారం, మోసం కేసులో అరెస్టైన చందు సాయి తాజాగా జైలు నుంచి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

  • Published Feb 23, 2024 | 3:01 PMUpdated Feb 23, 2024 | 5:47 PM
Chandu Sai: జైలు నుంచి బయటకు వచ్చాక తొలిసారి చందు సాయి ఎమోషనల్ వర్డ్స్

సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక.. సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యాక్టింగ్‌, సినిమాల మీద ఆసక్తి ఉన్న వారికి యూట్యూబ్‌ మంచి వేదికగా నిలిచింది. ఈ క్రమంలో నేడు చాలా మంది ముందుగా.. యూట్యూబ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ల్లో నటిస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత బుల్లితెర, రియాలిటీ షోలు, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. కొందరు హీరోలుగా, కమెడియన్లుగా రాణిస్తుంటే.. మరి కొందరు డైరెక్టర్స్‌గా కూడా రాణిస్తున్నారు. ఇలా యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చందు సాయి కూడా ఉన్నాడు. ఈ పేరుతో పిలిస్తే జనాలు గుర్తు పట్టడం కష్టమే కానీ.. పక్కింటి కుర్రాడు అంటే టక్కున గుర్తు పడతారు. షార్ట్‌ ఫిల్మ్‌లో నటిస్తూ.. ఎంతో గుర్తింపు, క్రేజ్‌ తెచ్చుకున్నాడు చందుసాయి.

అయితే కొన్నాళ్ల క్రితం అతడిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చందు సాయి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని.. లైంగికంగా వాడుకుని.. ఆ తర్వాత ముఖం చాటేశాడని ఆరోపించింది. ఈ క్రమంలో చందుసాయి మీద పోలీసులు అత్యాచారం, మోసం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడిని అరెస్ట్‌ చేశారు. దాంతో కోర్టు అతడికి రిమాండ్ విధించింది. 27 రోజులు జైల్లో ఉన్న చందు సాయి తాజాగా విడుదలయ్యాడు. ఈ క్రమంలో అతడు ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు తన జీవితంలో ఏం జరిగింది.. జైలు జీవితం ఎలా ఉంది.. అక్కడ తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో వివరించాడు.

అంతేకాక తన అరెస్ట్‌ అన్యాయం అన్న కోణంలో మాట్లాడాడు చందు సాయి. తానే తప్పు చేయలేదని.. నిజంగా తప్పు చేస్తే.. తన తండ్రే చంపేవాడని చెప్పుకొచ్చాడు. అలానే ఒక మనిషి మీద పగ తీర్చుకోవడానికి ఇంత దూరం వెళ్ళకూడదన్నాడు. అంతేకాక తన మీదనే కాక.. తన కుటుంబ సభ్యుల మీద అన్యాయంగా కేసులు పెట్టారని చెప్పుకొచ్చాడు. తాను 27 రోజులు జైల్లో ఉన్నానని.. మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నానని తెలిపాడు.

తాను నిజంగా ప్రేమించానని.. కానీ అవతలి వాళ్లు మాత్రం తనను మోసం చేశారని.. అన్యాయంగా కేసు పెట్టారు అన్నాడు చందుసాయి. తమ మధ్య రిలేషన్‌ని కాపాడుకోవడానికి తాను ప్రయత్నం చేస్తే.. ఆమె మాత్రం తన మీద కేసు పెట్టి షాక్ ఇచ్చిందన్నాడు. అంతేకాక ఈ సంఘటన వల్ల.. పక్కింటి కుర్రాడిగా సంపాదించుకున్న పేరు మొత్తం పోయిందని.. ఒక సినిమాలో అవకాశం కూడా కోల్పోయానని చెప్పుకొచ్చాడు. ఒక తప్పు జరిగితే అందులో ఇద్దరి ప్రమేయం ఉంటుంది.. కానీ శిక్ష మాత్రం ఒక్కరికే పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş