iDreamPost
android-app
ios-app

చంద్రహాస్ న్యూ మూవీ గ్లింప్స్ రిలీజ్.. యాక్షన్​ ఇరగదీశాడు!

  • Published Sep 08, 2024 | 6:09 PM Updated Updated Sep 08, 2024 | 6:09 PM

Chandrahass: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయమైన సంగతి విదితమే. అతడు హీరోగా బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ పేరుతో సినిమా మొదలైంది. ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు.

Chandrahass: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయమైన సంగతి విదితమే. అతడు హీరోగా బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ పేరుతో సినిమా మొదలైంది. ఇప్పుడు మరో మూవీతో రాబోతున్నాడు.

  • Published Sep 08, 2024 | 6:09 PMUpdated Sep 08, 2024 | 6:09 PM
చంద్రహాస్ న్యూ మూవీ గ్లింప్స్ రిలీజ్.. యాక్షన్​ ఇరగదీశాడు!

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, మలయజ కుమారుడు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు కవర్ సాంగ్‌కు దుమ్ము రేపే డ్యాన్స్ చేసి పాపులర్ అయ్యాడు ఈ వర్థమాన నటుడు. ఈ వీడియోకు వ్యూస్ మాత్రమే కాదు.. చంద్రహాస్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. కొడుకుకు నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన ప్రభాకర్, మలయజ అతడ్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పుడు తమ సొంత బ్యానర్‌‌లో మరో మూవీ షురూ చేశాడు. శ్రీ సుమనోహర పతాకంపై ‘రామ్‌నగర్ బన్నీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో మాస్ అండ్ యాక్షన్ లుక్కులో కనిపిస్తున్నాడు. ఇందులో కూడా కామెడీ కూడా పుష్కలంగా కనిపిస్తుంది.

గ్లింప్స్‌లో ‘తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్ముల్ని పగలకొట్టాల్సి వస్తుంది’.. అంటూ చంద్రహాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. స్టైల్ అండ్ స్వాగ్ కనిపనిస్తుంది. ఈ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోస్టర్లు కనిపిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ దృష్టి తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమాను సోదరి దివిజ ప్రభాకర్ ప్రజెంట్ చేస్తుండగా.. పేరెంట్స్ మలయజ, ప్రభాకర్ నిర్మిస్తున్నారు.  చంద్రహాస్‌తో పాటు విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతు మంత్ర, మురళీధర్, సలీమ్ ఫేకు, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుమూడి, ప్రణయ్ గణపూర్, శివ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీనివాస్ మహత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అశ్విన్ హేమంత్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా, అక్షర్ అలీ సినిమాటోగ్రాఫర్. త్వరలో థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తుంది.

కాగా, ఇది గ్లింప్స్ మాత్రమే. ఇక ట్రైలర్ కూడా త్వరలోనే విడుదల చేయనుంది చిత్ర యూనిట్. సినిమా డేట్ అఫీషియల్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు. గతంలో చంద్రహాస్ హీరోగా బ్లాక్ డాగ్ ఫర్ ఏ వైట్ చిక్ పేరుతో సినిమా మొదలైంది. కేట్ అనే అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తుంది. గత ఏడాది ఈ మూవీ అఫిషియల్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆర్కేఏకే ఫిల్మ్స్, ఐఈఎఫ్ కార్పొరేషన్ పతాకంపై రొమాంటిక్, యాక్షన్ అండ్ డ్రామా మూవీగా తెరకెక్కుతోంది. కిరణ్ బోయిన పల్లి, కిరణ్ జక్కం శెట్టి నిర్మిస్తున్నారు. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికే ఈ మూవీ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని సమాచారం. ఫస్ట్ మూవీ విడుదల కాకుండానే సెకండ్ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశాడు చంద్రహాస్.  ఈ రెండు చిత్రాలు మంచి హిట్ అందుకోవాలని  ఆశిద్దాం

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet