iDreamPost

‘చాలా బాగుంది’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?..

ఆమె దాదాపు 30 సినిమాలు చేస్తే.. అందులో పదికిపైగా గెస్ట్‌  అప్పియరెన్స్‌ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. 2007లో పెళ్లి తర్వాత ఆమె ఇండస్ట్రీకి కొంత దూరంగా వచ్చారు...

ఆమె దాదాపు 30 సినిమాలు చేస్తే.. అందులో పదికిపైగా గెస్ట్‌  అప్పియరెన్స్‌ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. 2007లో పెళ్లి తర్వాత ఆమె ఇండస్ట్రీకి కొంత దూరంగా వచ్చారు...

‘చాలా బాగుంది’ హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా?..

శ్వేత కొన్నూర్‌ మీనన్‌ అలియాస్‌ మాళవిక మీనన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా నైంటీస్‌ కిడ్స్‌కు ఈమె సుపరిచితురాలు. 1999 టు 2009 వరకు తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ మలయాళ భాషల్లో హీరోయిన్‌గా మాళవిక పలు సినిమాలు చేశారు. తమిళంలో టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు! వివాదాలు.. చాలా సినిమాల్లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిన హీరోయిన్‌గా మాళవికపై ఓ రికార్డు కూడా ఉంది. తెలుగులో  ఈమె నటించిన ‘‘ చాలా బాగుంది’’ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఆమె దాదాపు 30 సినిమాలు చేస్తే.. అందులో పదికిపైగా గెస్ట్‌  అప్పియరెన్స్‌ ఇచ్చిన సినిమాలు ఉన్నాయి. 2007లో పెళ్లి తర్వాత ఆమె ఇండస్ట్రీకి కొంత దూరంగా వచ్చారు. అరకొరగా చిత్రాలు చేస్తూ వచ్చారు. అది కూడా గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇస్తూ వచ్చారు. 2009 తర్వాత అసలు సినిమాలకే దూరం అయ్యారు. పూర్తిగా కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించారు. సోషల్‌ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత.. అందులో యాక్టీవ్‌ అయిపోయారు. సినిమాలు చేయకపోయినా.. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్‌ అవుతూ వచ్చారు.

దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తాను సినిమా కెరీర్‌ మొదలుపెట్టిన.. తమిళ చిత్ర పరిశ్రమలోనే రీ ఎంట్రీ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆమె ‘‘ గోల్‌మాల్‌’’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 2022లో ఈ సినిమా షూటింగ్‌ మొదలైంది. ఇందులో మంగమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, సినిమాల్లో పెద్దగా బిజీగా లేకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన అప్‌డేట్లను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉన్నారు. మరి, ప్రముఖ నటి మాళవిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి