Swetha
రీసెంట్ గా రిలీజ్ అయినా హిట్ 3 మూవీకి సూపర్ రెస్పాన్స్ దక్కింది. క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ అన్ని జోనర్ ప్రేక్షకులను థియేటర్స్ కు పుల్ చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో నానితో మరో నటుడు చైతు జొన్నలగడ్డ కూడా దుమ్ము దులిపేసాడని చెప్పి తీరాల్సిందే.
రీసెంట్ గా రిలీజ్ అయినా హిట్ 3 మూవీకి సూపర్ రెస్పాన్స్ దక్కింది. క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ అన్ని జోనర్ ప్రేక్షకులను థియేటర్స్ కు పుల్ చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో నానితో మరో నటుడు చైతు జొన్నలగడ్డ కూడా దుమ్ము దులిపేసాడని చెప్పి తీరాల్సిందే.
Swetha
రీసెంట్ గా నాని హిట్ 3 మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అందరికి తెలిసిందే . సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. లాంగ్ రన్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని తో పాటు ఎంతో మంది నటి నటులకు మంచి పేరు దక్కుతుంది. ఈ సినిమాలో ఎస్సై దివాకర్ పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డ విషయానికొస్తే.. నటుడిగా చైతూ జొన్నలగడ్డకు ఉన్న క్రేజ్, వస్తున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. బబుల్‌గమ్ చిత్రంలో యాదగిరి పాత్రలో చైతూ జొన్నలగడ్డకి మంచి ప్రశంసలు దక్కాయి. నటుడిగా తనకంటూ ఓ సెపరేట్ కామెడీ టైమింగ్, ట్రాక్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు . ఇక ఇప్పుడు నాని ‘హిట్ 3’ చిత్రంలో ఎస్సై దివాకర్ పాత్రలో అందరినీ మెప్పించారు. అబ్ కీ బార్.. అర్జున్ సర్కార్ అనే డైలాగ్‌తో థియేటర్లను దద్దరిల్లేట్టు చేశాడు చైతూ జొన్నలగడ్డ. అలా బబుల్‌గమ్ చిత్రంలో కామెడీ పాత్రతో.. ఇప్పుడు హిట్ 3లో సీరియస్ పాత్రతోనూ మెప్పించారు. నానితో పాటు చైతు జొన్నలగడ్డ కూడా దుమ్ము దులిపేసాడని చెప్పి తీరాల్సిందే.
నానితో చైతూ జొన్నలగడ్డకు వచ్చిన ప్రతీ సీన్ అదిరిపోయింది. థియేటర్లో దివాకర్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నటుడిగా చైతూ జొన్నలగడ్డ మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇలాంటి క్రైమ్ చిత్రాలకు ఈ రేంజ్ లో క్రేజ్ లభించడం చెప్పుకోదగిన విషయం . ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో చైతూ జొన్నలగడ్డ బిజీగా ఉన్నాడు. త్వరలోనే మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ తో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాడట . ఈటీవీ విన్‌లో ఒక ప్రాజెక్ట్, ఓ హిందీ సినిమా, మరో రెండు క్రేజీ, భారీ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నట్లు సమాచారం. ఇక ముందు ముందు చైతు జొన్నలగడ్డ ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.