iDreamPost
android-app
ios-app

హార్ట్ బ్రేక్ చేసే విషయం అంటూ .. నిహారిక మాజీ భర్త సంచలన పోస్ట్‌

  • Published Mar 16, 2024 | 1:39 PM Updated Updated Mar 16, 2024 | 1:39 PM

సాధారణంగా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ ఉండని నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ తాజాగా ఓ సంచలనమైన పోస్ట్ ను షేర్ చేశాడు.

సాధారణంగా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ ఉండని నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ తాజాగా ఓ సంచలనమైన పోస్ట్ ను షేర్ చేశాడు.

  • Published Mar 16, 2024 | 1:39 PMUpdated Mar 16, 2024 | 1:39 PM
హార్ట్ బ్రేక్ చేసే విషయం అంటూ .. నిహారిక మాజీ భర్త సంచలన పోస్ట్‌

మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నల గడ్డ వీరిద్దరూ విడాకులు తీసుకున్న దగ్గర నుంచి తరుచు వార్తలో నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుని, ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక విడాకులు తీసుకున్న నిహారిక ప్రస్తుతం సినిమాలు, షూటింగులతో బిజీగా ఉంటున్నారు. ఇక చైతన్య కూడా తన పనేదో తాను చూసుకుంటున్నాడు. కానీ, సోషల్ మీడియాలో తరుచు వీరిద్దరికి సంబంధించిన ప్రతి అప్ డేట్ వైరల్ అవుతుంది. ఇటీవలే నిహరిక రెండో పెళ్లి చేసుకుంటా.. పిల్లల్ని కంటా అని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు చైతన్య కూడా అందుకు పరోక్షంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఓ ఫోస్ట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్ గా మారింది.

ప్రేమించి పెళ్లి చేసుకొని,ఆ తర్వాత విడాకులు తీసుకున్న నిహారిక, చైతన్య జొన్నల గడ్డ రిలేషన్ షిప్ విషయంలో తరుచు ఏదో ఒక వార్తలు వినిపిస్తునే ఉన్నాయి. ఇటీవలే నిహారిక ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి చేసుకుంటానంట, పిల్లల్ని కనాలని ఉందంటూ.. ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నిహారిక ఇచ్చిన ఇంటర్వ్యూ పై చైతన్య జొన్నలగడ్డ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే అతడు వన్ సైడ్ వాదనను మాత్రమే ప్రచారం చేయడం తప్పంటూ ఇన్ డైరెక్టుగా నిహారికకు కౌంటర్లు వేశాడు. అసలు చైతన్య అంతగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. అయితే తాజాగా చైతన్య సైలెన్స్.. సైలెన్స్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ లో.. ‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం, నీటి అడుగున ఉన్న నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం, జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలలో మీరు కోరుకునే సైలేన్స్ .. ఇళా నిశ్శబ్దం అనేది మీ ప్రాణశక్తిని నుంచి వేరు చేస్తుంది. ఇదే మౌనం దేవుడితో కలిపే మాధ్యమం’ అంటూ ఫిలాసఫీకల్ గా చైతన్య రాసుకొచ్చాడు.

కాగా, ప్రస్తుతం చైతన్య జొన్నలగడ్డ షేర్ చేసిన ఈ పోస్ట్ అనేది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే అతను ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ చేశాడో తెలియదు కానీ, నెటిజన్స్ మాత్రం ఏమైందన్నా.. ఎందుకు సైలెన్స్ అంటూ పోస్ట్ పెట్టావ్‌ , దైవ చింతనలో మునిగిపోయావా అని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు చైతన్య పెట్టిన ఈ పోస్ట్ అనేది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరి, చైతన్య ఆ రకంగా పోస్ట్ పెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş