iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న చాహల్ భార్య..

  • Published Nov 21, 2024 | 3:47 PM Updated Updated Nov 21, 2024 | 3:47 PM

Yuzvendrachahal wife Dhanashree verma: టీమిండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సనిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

Yuzvendrachahal wife Dhanashree verma: టీమిండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ వర్మ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సనిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్.

  • Published Nov 21, 2024 | 3:47 PMUpdated Nov 21, 2024 | 3:47 PM
టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న చాహల్ భార్య..

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తన స్పిన్ మాయాజాలంతో సత్తాచాటాడు. ఇప్పుడు చాహల్ భార్య ధనశ్రీ వర్మ సినిమాల్లో రాణించేందుకు రెడీ అవుతోంది. అది కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఓ తెలుగు మూవీలో హీరోయిన్ గా చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే వెండి తెరకు పరిచయం కాబోతోంది చాహల్ వైఫ్. సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ధనశ్రీ వర్మ. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా ధన శ్రీ వర్మ క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధన శ్రీ వర్మకు ఫాలోవర్స్ ఓ రేంజ్ లో ఉంటారు. అంతే కాదు ఆమె డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. మంచి డ్యాన్సింగ్ టాలెంట్ ఉన్న బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

ఆరేళ్ల వయసు నుంచే భరత నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ధనశ్రీ అనేక డ్యాన్స్ ప్రదర్శనలతో బాగా ఫేమస్ అయ్యారు. తనకు సంబంధించిన ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తూ పాపులారిటీ పొందింది. కిరాక్ స్టెప్పులతో అదరగొడుతూ ఉంటుంది. అంతేకాదు టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చహల్ భార్యగా మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఆకాశం దాటి వస్తావా మూవీలో ధన శ్రీ వర్మ హీరోయిన్ గా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. శశి కుమార్ ముథిల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు ధన శ్రీ వర్మ. ఆకాశం దాటి వస్తావా సినిమాలో కొరియోగ్రాఫర్ యశ్ హీరోగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమాతోనే యశ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ నటి కార్తీక మురశీధరన్ లీడ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సెకండ్ లీడ్ హీరోయిన్ కోసం ధన శ్రీ వర్మను చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ‘ఆకాశం దాటి వస్తావా’ సినిమాలో డ్యాన్స్ కు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో ఈ ఆఫర్ కు ధనశ్రీ ఓకే చెప్పారట. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి, శ్రీలీలాతో డ్యాన్స్ లో పోటీపడే సత్తా ధన శ్రీకి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ఆమె దగ్గర డ్యాన్స్ శిక్షణ తీసుకోడానికి వచ్చిన సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారితీసింది. దీంతో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ లోకి హీరోయిన్ గా చాహల్ భార్య ధన శ్రీ వర్మ ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom