iDreamPost
android-app
ios-app

మరీ తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు! మంచు విష్ణు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

  • Author Soma Sekhar Published - 07:40 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 07:40 PM, Mon - 17 July 23
మరీ తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారు! మంచు విష్ణు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్స్ ఎలా ఉండాలి అనుకుంటారు? తెల్లగా, పొడుగ్గా ఉండాలని డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అనుకుంటారు. కానీ ఓ బ్యూటీకి మాత్రం తెల్లగా ఉండటమే శాపంగా మారిందట. మరీ తెల్లగా ఉండటం వల్ల ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొవడమే కాక.. ఆమెను చాలా సందర్భాల్లో ప్రాజెక్ట్స్ నుంచి రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ ఎవరో కాదు.. మంచు విష్ణు సరసన ఓ చిత్రంలో మెరిసిన బ్యూటీ. పైగా 2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచింది కూడా. మిస్ యూనివర్స్ పోటీల్లో కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుని రన్నరప్ గా నిలిచింది ఈ బ్యూటీ. ఇది జరిగి 22 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

సెలీనా జైట్లీ.. చాలా మందికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ ఈ అమ్మడు తెలుగులో ఓ సినిమాలో నటించింది. మంచు విష్ణు సరసన ‘సూర్యం’ మూవీలో చేసింది. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాని చెయ్యలేదు. పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైపోయింది. కాగా.. 2001తో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన సెలీనా.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. అప్పటి అనుభవాలను గుర్తుకుతెచ్చుకుంటూ.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఈ విధంగా చెప్పుకొచ్చింది సెలీనా జైట్లీ..

“103 మంది పాల్గొన్న మిస్ యూనివర్స్ పోటీల్లో నేను కొద్దిగా పొట్టిగా ఉన్నా.. అయినా గానీ రన్నరప్ గా నిలిచాను. ఇక నేను 15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ రంగంలోకి వచ్చాను. చాలా ఒత్తిడులు, కష్టాలు అన్ని చూశాను. ఆ టైమ్ లో నా ఏజ్ వాళ్లందరు పార్టీలు అంటూ వీకెండ్స్ ఎంజాయ్ చేసేవాళ్లు. నేను మాత్రం కోల్ కత్తాలో ర్యాంప్ వాక్స్, షూటింగ్స్ అంటూ డబ్బులు సంపాదించుకునే దాన్ని. కొన్ని సార్లు నా చేత షోలు, ర్యాంప్ వాక్ లు చేయించుకుని డబ్బులు కూడా సరిగా ఇచ్చేవారు కాదు” అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చింది సెలీనా.

వీటితో పాటుగా తన అనుమతి లేకుండా ఫోటోలు వాడుకునేవాళ్లని, మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలా సార్లు తనను రిజెక్ట్ చేసినట్లు సెలీనా తెలిపింది. అయితే ఈ రెండు క్వాలిటీసే తనను అందరిలో స్పెషల్ గా మార్చిందని సంతోషం వ్యక్తం చేసింది. ఇక దేశం తరపున ఓ నటిగా, అంబాసిడర్ గా షోలల్లో పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను అని పేర్కొంది. మరీ తెల్లగా ఉన్నానని రిజెక్ట్ చేశారని చెప్పిన సెలీనా జైట్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Celina Jaitly (@celinajaitlyofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş