iDreamPost
android-app
ios-app

వీఎన్ ఆదిత్య డైరెక్షన్‌లో కేథరిన్ మూవీ! ఓ రేంజ్‌లో భయపెట్టేలా!

  • Published Sep 10, 2024 | 2:31 PM Updated Updated Sep 10, 2024 | 2:31 PM

టాలీవుడ్ ముద్దుగుమ్మ కేథరిన్ థెరిస్సా తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమైంది. వాల్తేరు వీరయ్యలో ఓ స్మాల్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు ఆమె కొత్త సినిమా కబురు వినిపించింది.

టాలీవుడ్ ముద్దుగుమ్మ కేథరిన్ థెరిస్సా తెలుగు ప్రేక్షకులను పలకరించి చాలా కాలమైంది. వాల్తేరు వీరయ్యలో ఓ స్మాల్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు ఆమె కొత్త సినిమా కబురు వినిపించింది.

  • Published Sep 10, 2024 | 2:31 PMUpdated Sep 10, 2024 | 2:31 PM
వీఎన్ ఆదిత్య డైరెక్షన్‌లో కేథరిన్ మూవీ! ఓ రేంజ్‌లో భయపెట్టేలా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తళుక్కుమన్న తార కేథరిన్ థెరిస్సా. అల్లు అర్జున్- పూరీ ఫిల్మ్ ఇద్దరు అమ్మాయిలతో ఒక్కసారిగా తెలుగు ఆడియన్స్ హార్ట్ థ్రోబ్ చేసిన ఈ బ్యూటీఫుల్ గర్ల్.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయ్యింది.  నాని, అల్లుఅర్జున్, రవితేజ, గోపిచంద్, విజయ్ దేవరకొండ, నితిన్, కళ్యాణ్ రామ్, రానా వంటి స్టార్ హీరోలతో నటించిన అమ్మడు.. గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు కావడంతో చాలా సెలక్టివ్ రోల్స్ చేస్తుంది. దీంతో టాలీవుడ్ ఆడియన్స్‌కు కాస్త దూరమైనట్లు కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కంబ్యాక్ అవుతుంది. తాజాగా ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని లేటెస్ట్ మూవీ అప్ డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న ఈ చిన్నది.

మనసంతా నువ్వే, నేనున్నాను వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడు విఎన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కేథరిన్ నటించబోతుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా  స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో స్టన్నింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. చిరునవ్వుతో మరోసారి కుర్రకారుకు మతి పోగొడుతుంది కేథరిన్. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆమె కీ రోల్ ప్లే చేస్తుంది.  ఓ రేంజ్‌లో భయపెట్టేందుకు సిద్ధమైంది. AU&I సమర్పణలో OMG ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ మీనాక్షి అనిపిండి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అమెరికాలోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారని తెలుస్తుంది. ఇందులో ఆల్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, టెక్నీషియన్లు పనిచేయబోతున్నారని టాక్. పాన్ ఇండియా చిత్రంగా తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్ రావాల్సి ఉంది.

దుబాయ్‌లో మలయాళ కుటుంబంలో పుట్టిన కేథరిన్, మోడలింగ్ రంగం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. శంకర్ ఐపీఎస్ అనే మూవీతో శాండిల్ వుడ్‌లో అడుగుపెట్టిన ఆమె.. ఛమ్మక్ ఛల్లో చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరు అమ్మాయిలతో, పైసా, రుద్రమదేవీ, సరైనోడు చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చాయి. క్యూట్ నెస్ యాక్టింగ్‌తో టాలీవుడ్ కుర్రాళ్ల క్రష్‌గా మారింది. ఇటు తెలుగులోనే కాదు తమిళంలోకూడా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకెళ్లింది. తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ.. బాగా క్లిక్ అయ్యింది ఈమెనే. ఈ మధ్య కాలంలో వరల్డ్ ఫేమస్ లవర్, భళా తందానాన, బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్యలో చిత్రాల్లో మెరిసింది. వాల్తేరు వీరయ్య తర్వాత ఆమె తెలుగు ఆడియన్స్‌ను పలకరించలేదు.. ఎలాంటి అప్ డేట్స్ లేవు అనుకున్న సమయంలో కొత్త సినిమా కబురు వినిపించింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet