iDreamPost
android-app
ios-app

యూట్యూబర్ హర్షసాయి మరో మోసం!.. కేసు నమోదు చేసిన పోలీసులు

  • Published Sep 30, 2024 | 3:37 PM Updated Updated Sep 30, 2024 | 4:36 PM

YouTuber Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. అతనిపై మరో కేసు నమోదైంది. వెగులోకి కొత్త మోసం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యువతి హర్షపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

YouTuber Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి మరో షాక్ తగిలింది. అతనిపై మరో కేసు నమోదైంది. వెగులోకి కొత్త మోసం రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యువతి హర్షపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

  • Published Sep 30, 2024 | 3:37 PMUpdated Sep 30, 2024 | 4:36 PM
యూట్యూబర్ హర్షసాయి మరో మోసం!.. కేసు నమోదు చేసిన పోలీసులు

పాపులర్ యూట్యూబర్ హర్షసాయి అత్యాచార ఆరోపణలతో హాట్ టాపిక్ గా మారాడు. గతకొన్ని రోజులుగా హర్షసాయి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ గా ఫేమ్ తెచ్చుకున్న హర్ష ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. హర్ష చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండడంతో అతని చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి ఫిర్యాదుతో ఇప్పటికే హర్షసాయిపై కేసు నమోదైంది. నార్సింగి పోలీసులు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. తాజాగా హర్షసాయి చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో హర్షపై మరో కేసు నమోదైంది. అతడి ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

సహాయం పేరుతో రూ. 5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో హర్షపై 406,419,420, ఐపీసీ, 66సీ, 66డీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుతో హర్షసాయికి మరో షాక్ తగిలినట్లైంది. ఇటీవల హర్షసాయి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తన వద్ద రూ. 2 కోట్లు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. అంతే కాదు మూవీ స్క్రిప్ట్ డిస్కషన్స్ తో తనను పిలిపించుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడడని తెలిపింది. అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పింది. దీంతో హర్షపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు జల్లెడపడుతున్నారు.

గత వారం రోజులుగా హర్ష కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు అనంతరం హర్షసాయి పరారీలో ఉన్నాడు. కాగా ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. రోజుకో ఆడియో వెలుగులోకి వస్తుంది. బాధిత యువతితో హర్షసాయి మాట్లాడిన ఆడియోలు బయటికి వస్తున్నాయి. మరోవైపు హర్షసాయి తాను ఏ తప్పు చేయలేదని త్వరలోనే నిజనిజాలు తెలుస్తాయని వెల్లడించాడు. కానీ ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే కానీ అసలు విషయాలు బయటికి తెలిసే వీలుంది.

హర్షసాయి ఓ మూవీ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా హర్ష తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. యువతి ఫిర్యాదు అనంతరం హర్షసాయి మోసాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు తనకు తోచిన సాయం చేస్తూ హీరో అయిన హర్ష నేడు అందరి దృష్టిలో విలన్ అయ్యాడు. హర్ష ఇంత మోసగాడా అని చర్చలు మొదలయ్యాయి. మరి హర్ష సాయిపై మరో కేసు నమోదవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom