P Venkatesh
Actress Kasthuri: నటి కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సంఘాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులోని తెలుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Actress Kasthuri: నటి కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సంఘాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులోని తెలుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
P Venkatesh
ఇటీవల తమిళ నటి కస్తూరి తెలుగువారిపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు ప్రజలను కించపరిచేలా ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలుగు సంఘాలు కస్తూరి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే?.. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తెలుగు వారిపై నీచమైన కామెంట్స్ చేసి తన అక్కసు వెల్లగక్కింది. తమిళనాడులోని తెలుగువారిని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. తెలుగు వారు తమిళుల బానిసలంటూ రెచ్చిపోయింది. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని తక్కువచేసి మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసింది.
నటి కస్తూరి చేసిన కామెంట్స్ కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడులోని తెలుగు ప్రజలు నటి కస్తూరిపై ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కంప్లైంట్ అందుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమిళనాడు పోలీస్ శాఖ ఆమె చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కస్తూరి అరెస్టుకు రంగం సిద్ధం అయ్యింది. ఆమెను ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది.
కాగా నటి కస్తూరి ఇటీవల తమిళనాడులో బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి హాజరైంది. అయితే తమిళనాడులో బ్రాహ్మణుల గుర్తింపు గురించి మాట్లాడే క్రమంలో తెలుగు వారి ప్రస్తావన తీసుకొచ్చారు. 300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర రాణులకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే… మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..? అని పరోక్షంగా ద్రావిడ వాదులను ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు సీఎం క్యాబినెట్‌లో ఐదుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నవారే అని ఆమె పేర్కొన్నారు.
ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు, పరస్త్రీలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది వివాహం చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది అని కస్తూరి విమర్శించారు. తెలుగు మాట్లాడే వాళ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలుగు వారిపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినందుకు నటి కస్తూరిపై ఫైర్ అయ్యారు. కస్తూరి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడంతో ఆమె దిగొచ్చారు.
తెలుగు వారిని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదని.. నా వ్యాఖ్యలు మీ మనసులను బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ కోరింది. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కస్తూరి తెలిపింది. మీడియా కావాలనే తనపై దుష్ర్పచారం చేస్తుందని కస్తూరి వెల్లడించింది. మరి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడంతో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. మరి నటి కస్తూరిపై కేసు నమోదవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.