iDreamPost
android-app
ios-app

ప్రముఖ కమెడియన్‌ యోగిబాబుపై చీటింగ్‌ కేసు!

ప్రముఖ కమెడియన్‌ యోగిబాబుపై చీటింగ్‌ కేసు!

ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడే అయినా దేశ వ్యాప్తంగా ఆయనకంటూ ఓ మంచి గుర్తింపు ఉంది. ఆయన తీసిన సినిమాలు తెలుగులో కూడా డబ్‌ అవ్వటం వల్ల ఇక్కడ కూడా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. తరచుగా డబ్బింగ్‌ సినిమాలతో ఆయన తెలుగు తెరపై మెరుస్తూనే ఉన్నారు. తాజాగా, జైలర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ సినిమాలో తన మార్కు నటనతో పిచ్చ కామెడీ పండించారు.

ప్రస్తుతం ఆయన వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఇలాంటి ఈ సమయంలో ఆయనపై ఓ తమిళ నిర్మాత కేసు పెట్టాడు. యోగిబాబు డబ్బు తీసుకుని మోసం చేశాడంటూ సదరు నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల ఫిర్యాదులో నిర్మాత వెల్లడించిన వివరాల మేరకు.. హసిర్‌.. రూబీ ఫిల్మ్స్‌ అనే నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నాడు. హసిర్‌ ‘జాక్‌ డేనియల్‌’ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో ఓ రోల్‌ కోసం ఆయన యోగిబాబును సంప్రదించారు. 65 లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌తో యోగిబాబు సినిమా చేయటానికి సిద్ధమయ్యారు. ఒప్పందంలో భాగంగా హసిర్‌ అడ్వాన్స్‌ కింద 20 లక్షల రూపాయలు ఇచ్చాడు.

అయితే, రోజులు గడుస్తున్నా యోగిబాబు సినిమా షూటింగ్‌కు రాలేదు. ఈ విషయంలో యోగిబాబును కలిసినా లాభం లేకపోయింది. అంతేకాదు! యోగిబాబు డబ్బు వెనక్కు తిరిగి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే నిర్మాత హసిర్‌ పోలీసులను ఆశ్రయించాడు. యోగిబాబు 20 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు. యోగిబాబుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, యోగిబాబు మోసం చేశాడంటూ ఓ నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş