iDreamPost
android-app
ios-app

Aishwarya Ragupathi: ఆడియో లాంఛ్‌లో అసభ్య ప్రవర్తన.. యువకుడ్ని చితక్కొట్టిన నటి!

  • Published Jan 04, 2024 | 10:57 AM Updated Updated Jan 04, 2024 | 12:33 PM

కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, చిత్ర ఆడియో లాంఛ్‌ ఘనంగా జరిగింది.

కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, చిత్ర ఆడియో లాంఛ్‌ ఘనంగా జరిగింది.

  • Published Jan 04, 2024 | 10:57 AMUpdated Jan 04, 2024 | 12:33 PM
Aishwarya Ragupathi: ఆడియో లాంఛ్‌లో అసభ్య ప్రవర్తన.. యువకుడ్ని చితక్కొట్టిన నటి!

ప్రముఖ గ్లోబల్‌ స్టార్‌ ధనుష్‌ హీరోగా ‘‘ కెప్టెన్‌ మిల్లర్‌’’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి నెలలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. మూవీ విడుదల అవ్వటానికి కొద్దిరోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఆడియో లాంఛ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. ధనుష్‌ అభిమానుల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత కెప్టెన్‌ మిల్లర్‌లో నటించిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కెప్టెన్‌ మిల్లర్‌లో నటించిన ఐశ్వర్య రఘుపతి ఆడియో లాంఛ్‌ కార్యక్రమానికి హజరైంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత జనంతో పాటు బయటకు రావటానికి ప్రయత్నించింది. ధనుష్‌ అభిమానులు ఎక్కువగా ఉండటంతో వారిని దాటుకుని ముందుకు వెళ్లటం కొంచెం కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి గుంపులో గోవింద అన్నట్లు ఐశ్వర్య రఘుపతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడ్ని గుర్తించింది. ఆ యువకుడ్ని పట్టుకుని కొడుతూ తిట్టింది. తన తప్పు తెలుసుకున్న ఆ యువకుడు ఆమెకు క్షమాపణ చెప్పాడు. అంతేకాదు! అక్కడినుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అయినా ఆమె ఆగలేదు. తీవ్రంగా ఫైర్‌ అయింది. కొంచెం సేపటి తర్వాత ఆ యువకుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఐశ్వర్య రఘుపతి యువకుడ్ని తిట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ మధ్య కాలంలో ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువయ్యారు. వీళ్లను ఊరికే వదిలేయకూడదు’’.. ‘‘ఐశ్వర్య రఘుపతి మంచి పని చేశారు. ఇంకా నాలుగు తగిలించాల్సింది’’.. ‘‘ ఆడియో ఫంక్షన్లలో సినిమా వాళ్లకు చేదు అనుభవాలు ఎక్కువవుతున్నాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, కెప్టెన్‌ మిల్లర్‌కు అరుణ్‌ మాదేశ్వరన్‌ దర్శకత్వం వహించారు.

ధనుష్‌ సరసన ప్రియాంక అరుల్‌మోహన్‌ నటిస్తున్నారు. శివరాజ్‌ కుమార్‌, వినాయకన్‌, నివేదితా సతిష్‌, ఐశ్వర్య రఘుపతి, ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. సెంధిల్‌ త్యాగరాజన్‌, అరుణ్‌ త్యాగరాజన్‌లు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మరి, కెప్టెన్‌ మిల్లర్‌ ఆడియో లాంఛ్‌ సందర్భంగా తనతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఐశ్వర్య రఘుపతి బుద్ధి చెప్పటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetpasacasinocasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetkazansana girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom