iDreamPost
android-app
ios-app

ముఫాసా ది లయన్ కింగ్ కోసం.. మహేష్ బాబు

  • Published Aug 16, 2024 | 3:35 PM Updated Updated Aug 16, 2024 | 3:35 PM

Mahesh Babu For Mufasa: ప్రసుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి తో ఓ సీరియస్ ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మూవీ అంటే ఇక మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ కు చెక్ పెట్టాల్సిందే. కానీ మహేష్ మాత్రం ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నట్లు సమాచారం.

Mahesh Babu For Mufasa: ప్రసుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి తో ఓ సీరియస్ ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మూవీ అంటే ఇక మిగిలిన అన్ని ప్రాజెక్ట్స్ కు చెక్ పెట్టాల్సిందే. కానీ మహేష్ మాత్రం ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నట్లు సమాచారం.

  • Published Aug 16, 2024 | 3:35 PMUpdated Aug 16, 2024 | 3:35 PM
ముఫాసా ది లయన్ కింగ్  కోసం.. మహేష్ బాబు

ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా వస్తుందంటే.. దానికి చాలా సమయం పడుతుందని.. ఒక్క సారి స్టార్స్ ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాక… కంప్లీట్ అయ్యేంత వరకు మరే ప్రాజెక్ట్స్ ను ఒప్పుకోరనే టాక్ ఎప్పటినుంచో ఉన్నదే. ఈ క్రమంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో ఓ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రాజమౌళి , మహేష్ పేరు తప్ప ఇంకే విషయాలు ఇప్పటివరకు తెలియవు. అయితే ఇప్పుడు మహేష్ ఈ మూవీ కంటే ముందు.. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హాలీవుడ్ సినిమాలను మన దగ్గర ఎవరు చూస్తారని.. వాటిని లైట్ తీసుకుంటే మాత్రం పొరపాటే. ఇక్కడ కూడా ఆ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారు. వాటిలో కొన్ని సినిమాలకు ప్రత్యేకించి అభిమానులు కూడా ఉన్నారు. వాటిలో ఒకటి 2019లో విడుదలైన లయన్ కింగ్‌. ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసి.. ప్రపంచ వ్యాప్తంగా 11 వేల 400 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ఆ మూవీకి ప్రిక్వెల్ గా ..’ముఫాసా ది లయన్ కింగ్’ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం.. మహేష్ బాబు ఈ మూవీలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం. అడపా దడపా మహేష్ కొన్ని క్యారెక్టర్స్ కు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉంటారు. కానీ ఇలా ఓ స్పెషల్ క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటి సారి. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో చూడాలి.

కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ముఫాసా ది లయన్ కింగ్’ ట్రైలర్.. సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక సరిగ్గా అదే సమయంలో తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాల మధ్యన పోటీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని.. ఆశతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. త్వరలోనే మూవీకి సంబంధిచిన అప్ డేట్స్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మరి ముఫాసా చిత్రంలో మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు వినిపిస్తున్న బజ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet