Swetha
ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా సినిమా అంటే ఏంటి.. దేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో సినిమాను రిలీజ్ చేయడమేనా! అంటే అసలు కానే కాదు. దానికి తగినట్లు అన్ని రాష్ట్రాల్లో సినిమాను ప్రమోట్ చేయాలి కూడా. అప్పుడే సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో ప్రేక్షకులు అర్ధం చేసుకుని.. థియేటర్స్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు.
ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా సినిమా అంటే ఏంటి.. దేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో సినిమాను రిలీజ్ చేయడమేనా! అంటే అసలు కానే కాదు. దానికి తగినట్లు అన్ని రాష్ట్రాల్లో సినిమాను ప్రమోట్ చేయాలి కూడా. అప్పుడే సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో ప్రేక్షకులు అర్ధం చేసుకుని.. థియేటర్స్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు.
Swetha
ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా సినిమా అంటే ఏంటి.. దేశంలో ఉన్న అన్ని ప్రధాన భాషల్లో సినిమాను రిలీజ్ చేయడమేనా! అంటే అసలు కానే కాదు. దానికి తగినట్లు అన్ని రాష్ట్రాల్లో సినిమాను ప్రమోట్ చేయాలి కూడా. అప్పుడే సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో ప్రేక్షకులు అర్ధం చేసుకుని.. థియేటర్స్ వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు పుష్ప 2 విషయంలో బన్నీ ప్రమోషన్స్ లో ప్యాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాడు. ప్రమోషన్స్ అందరు చేస్తారు.. కానీ ఇలాంటి ప్రమోషన్స్ కేవలం పుష్ప రాజ్ కు సాధ్యం అని నిరూపిస్తున్నాడు. ముంబై , మహారాష్ట్ర , బెంగళూరు , చెన్నై లాంటి మహానగరాలకు వెళ్లి ఏవో నాలుగు ప్రెస్ మీట్ లు పెట్టి.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కాదని.. ఎంత ఖర్చు పెట్టామో దానికి తగిన ఫలితం ఏ విధంగా రాబట్టలో.. సాక్ష్యాలతో సహా పుష్ప 2 టీం నిరూపిస్తుంది.
ఎప్పుడైతే ట్రైలర్ లాంచ్ ను బీహార్ లాంటి ప్లేస్ లో అరేంజ్ చేశారో.. అక్కడే పుష్ప వేసిన మొదటి అడుగు బ్రహ్మాండంగా పేలింది. అసలు సౌత్ సినిమాలను అంతగా పట్టించుకోని ప్లేస్ లో..దాదాపు రెండు లక్షలకు పైగా జనం రావడం మొత్తం ఇండియా దృష్టిని ఆకట్టుకుంది. దాని తర్వాత చెన్నై , కొచ్చి ఈవెంట్ లు మరో బ్లాక్ బస్టర్. తెలుగు వారికి బన్నీ మీద ఎనలేని అభిమానం , సినిమాలంటే పిచ్చి ప్రేమ ఉంటాయి కాబట్టి.. ఇక్కడ అంత మంది జనం వచ్చినా కూడా అది మామూలు విషయం లానే అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు తెలుగు సినిమాల మీద అంత హైప్ లేని ప్లేస్ లో.. అంత మంది జనం రావడం.. అక్కడ మీడియాకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. ఈ లెక్కన్న అక్కడ ఓపెనింగ్స్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క ఈవెంట్ కే ఈ రేంజ్ లో జనం వస్తున్నారంటే.. ఇక మూవీ రిలీజ్ రోజు ఎంత మంది వస్తారో అందరూ ఊహించవచ్చు.
ఇక తెలుగు స్టేట్స్ లో ఈవెంట్స్ గురించి మాత్రం టాక్ నడుస్తుంది కానీ క్లారిటి రాలేదు. ఇతర స్టేట్స్ లోనే ఇలా ఉంటె ఇక ఇక్కడ ఈవెంట్స్ మోత మోగిపోవాల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ బయటకు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. మరో వైపు సుకుమార్ మూవీ అవుట్ పుట్ ను కూడా ఇచ్చేసాడు. ఈ లోపే బన్నీ ప్రమోషన్స్ బాధ్యతను తనపై వేసుకుని.. సినిమా లెవెల్ ను పెంచుతున్నాడు . అటు మూవీ లెంగ్త్ విషయంలో కూడా చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సినిమాకు రావాల్సిన హైప్ కంటే కూడా ఒకింత ఎక్కువ హైప్ ఏ వస్తుంది. ఇక రిజల్ట్ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడడమే లేట్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.