iDreamPost
android-app
ios-app

మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ. 99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూసేయొచ్చు

  • Published Sep 18, 2024 | 2:21 PM Updated Updated Sep 18, 2024 | 2:21 PM

మీకు ఇష్టమైన సినిమా థియేటర్లలో నడుస్తుందా...? ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నారా..? తడిసిమోపుడు అవుతుందని ఆందోళన చెందుతున్నారా..? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే.

మీకు ఇష్టమైన సినిమా థియేటర్లలో నడుస్తుందా...? ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకుంటున్నారా..? తడిసిమోపుడు అవుతుందని ఆందోళన చెందుతున్నారా..? అయితే ఈ బంపరాఫర్ మీకోసమే.

  • Published Sep 18, 2024 | 2:21 PMUpdated Sep 18, 2024 | 2:21 PM
మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. రూ. 99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూసేయొచ్చు

ఉరుకుల పరుగుల జీవితంలో, టెన్షన్, స్ట్రెస్‌తో ఆందోళన చెందుతున్న సమయంలో కాస్తంత స్వాంతన చేకూర్చేవి సినిమాలే. ఎంటర్‌టైన్ చేస్తూ.. కూసింత సేపు మన కష్టాలను పక్కన పెడతాయి. అయితే ఫ్యామిలీతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ల్సే. వీటిల్లో సినిమాలు చూడాలంటే.. జేబుకు చిల్లుపడాల్సిందే. ఒక్కో టికెట్ ధర 250 రూపాయలకు పైమాటే. అంతంత డబ్బులు పోసి కుటుంబంతో సినిమా చూడాలన్న కల కల్లగా మారిపోతుంది. కేవలం టికెట్ రేట్లకు భయపడి సినిమాలు చూడటం మానేశారు సామాన్యులు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాం లే అని సరిపెట్టుకుంటున్నారు. అలాంటి వారికో గుడ్ న్యూస్. కేవలం వంద రూపాయల లోపు ఖర్చుతో మల్టీ ఫ్లెక్స్ లో సినిమాలు చూసేయొచ్చు.

మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకున్న ఆడియెన్స్‌కు శుభవార్త చెప్పింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. జస్ట్ రూ. 99కే సినిమా చూసే అవకాశాన్ని ఇస్తున్నాయి మల్టీ ఫ్లెక్స్. అయితే ఈ ఆఫర్ మాత్రం కేవలం ఒక్కరోజే సుమీ. పోనీ ఆ రోజు ఏదైనా మంచి సినిమా థియేటర్‌లో ఉంటే చూసేస్తామంటారా..? పోనీ అలాగే కానీయ్యండి. ఇంతకు ఆ ఆఫర్ ఏ రోజు వర్తిస్తుందంటే.. సెప్టెంబర్ 20న. అంటే ఈ శుక్రవారమే. సెప్టెంబర్‌ 20న నేషనల్‌ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్‌ చైన్ థియేటర్లు ఈ ఆఫర్‌ని ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా ఏ భాష సినిమా అయినా, ఏ షో అయినా కేవలం రూ. 99 రూపాయలకే చూసే అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నాయి మల్టీఫ్లెక్స్ థియేటర్లు.

ఈ విషయాన్ని బాలీవుడ్‌ మూవీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్స్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించాడు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కన్నా తక్కువ రేటుకు అంటే కేవలం రూ. 99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూసే అవకాశం లభిస్తుంది. పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్, ఏషియన్, సినీపోలీస్ లాంటి చైన్లతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న 4 వేలకుపైగా స్క్రీన్లలో సెప్టెంబర్ 20న దేశంలో ఎక్కడైన రూ. 99లకే మూవీ చూసే బంఫర్ ఆఫర్ ప్రకటించాయి థియేటర్స్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. 3D, రెక్లైనర్లు, ప్రీమియం ఫార్మాట్‌ స్క్రీన్లకు ఈ ఆఫర్ వర్తించదు. కేవలం మల్టీఫ్లెక్స్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. ఇది తెలిసి మూవీ లవర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ప్లాన్ చేసుకుని ఈ నెల 20న ఫ్యామిలీతో సినిమా చూసేయొచ్చు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş