అల్లు శిరీష్ ‘బడ్డీ’ మూవీ టికెట్ ధరల్లో తగ్గింపు.. ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా!

Buddy Movie Ticket Prices: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అల్లు శిరీష్ కూడా ఒకరు. కాస్త గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ న్యూ మూవీ టికెట్ ధరలు, రన్ టైమ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Buddy Movie Ticket Prices: ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో అల్లు శిరీష్ కూడా ఒకరు. కాస్త గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ న్యూ మూవీ టికెట్ ధరలు, రన్ టైమ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

యంగ్ హీరో అల్లు శిరీష్.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత.. ఓ ఇంట్రెస్టింగ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా పేరు “బడ్డీ”. ఈ సినిమా ఆగష్టు 2 న థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కొన్ని ప్రీమియర్ షోస్ ను ప్రదర్శించారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద డీసెంట్ హైప్ నడుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో అల్లు శిరీష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనేది మాత్రం కన్ఫర్మ్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మూవీ టికెట్ ధరలు , రన్ టైమ్ పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు చూసేద్దాం .

ఈ మధ్య మూవీ టికెట్ ధరల విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే రీసెంట్ గా రిలీజ్ అయిన పేకమేడలు అనే మూవీ.. తక్కువ ధరలకు టికెట్స్ ను సేల్ చేసింది. ఇక ఇప్పుడు బడ్డీ టీమ్ కూడా అదే ట్రెండ్ ను ఫాలో అవుతుంది. ఈ సినిమా టికెట్స్ ను సాధారణ టికెట్ ధరల కంటే కూడా తక్కువ ధరకే టికెట్స్ ను సేల్ చేస్తున్నట్లు ప్రకటించారు మూవీ టీమ్. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర ధర రూ.99, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రేటు రూ.125గా ఉండనున్నట్లు అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాకు చిన్న పిల్లలని బాగా అలరిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ మూవీ ఎక్కువమంది చూస్తే మాత్రం కచ్చితంగా మౌత్ టాక్ ద్వారా.. సినిమా ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కలెక్షన్స్ కూడా బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక బడ్డీ సినిమా రన్ టైం విషయానికొస్తే.. ఈ సినిమా మొత్తం 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో రానుంది. తాజాగా ఓ ఈవెంట్ లో అల్లు శిరీష్ ఈ విషయాన్నీ తెలియజేశారు. మూవీ రిలీజ్ కు ఇంకా తక్కువ సమయమే ఉంది కాబట్టి.. చిత్ర బృందం మూవీ ప్రొమోషన్స్ లో బిజి బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఒకవేళ సినిమా హిట్ టాక్ సంపాదిస్తే మాత్రం.. శిరీష్ కెరీర్ లో ఇక బ్రేకులు ఉండవని చెప్పి తీరాల్సిందే. ఊర్వశివో రాక్షసీవో మూవీ తర్వాత శిరీష్ కెరీర్ లో కాస్త గ్యాప్ వచ్చింది . ఇక ఇప్పుడు బడ్డీ మూవీ తో హిట్ కొట్టే ప్లాన్ లో ఉన్నాడు .ఈ మూవీ శిరీష్ కు ఎలాంటి రిజల్ట్ తెచ్చిపెడుతుందో చూడాలి. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments