iDreamPost
android-app
ios-app

బుచ్చి బాబు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడా! RC 16 బ్యాక్డ్రాప్.. ?

  • Published Nov 02, 2024 | 3:03 PM Updated Updated Nov 02, 2024 | 3:03 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఈ హీరో మీద అందరికి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అసలు ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా. మరి ఆ మాత్రం అంచనాలు ఉండడంలో తప్పు లేదు. ఇప్పుడు బుచ్చిబాబుతో తీయబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఈ హీరో మీద అందరికి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అసలు ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా. మరి ఆ మాత్రం అంచనాలు ఉండడంలో తప్పు లేదు. ఇప్పుడు బుచ్చిబాబుతో తీయబోయే సినిమా గురించి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 02, 2024 | 3:03 PMUpdated Nov 02, 2024 | 3:03 PM
బుచ్చి బాబు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాడా! RC 16 బ్యాక్డ్రాప్.. ?

రామ్ చరణ్ మూవీ అంటే పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది మొదలైన మాట వాస్తవం . అయితే ఆ తర్వాత చరణ్ స్పీడ్ కొంచెం తగ్గింది. ఆచార్యలో గెస్ట్ రోల్ లో కనిపించినా కూడా అది చరణ్ కు గట్టి షాక్ నే ఇచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఆచార్య దెబ్బతో జక్కన్న సెంటిమెంట్ కంప్లీట్ అయిందని.. గేమ్ చెంజర్ సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. రామ్ చరణ్ ఎప్పుడు చేయని కాన్సెప్ట్ ఇది . అందుకే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ శంకర్ మాత్రం సినిమా విషయంలో ఎక్కడో కాస్త భయపడుతున్నారని.. సినిమాలో కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నారు సమాచారం. ఆ డేట్ ఈ డేట్ అంటూ మార్చి సినిమాను జనవరి 10 న రిలీజ్ చేస్తాం అని అనౌన్స్ చేశారు.

ఈ సినిమా కోసం చిరంజీవి తన సినిమాను వాయిదా వేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే సినిమాపై అనేక రకాల ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయినా సరే శంకర్ మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు. ట్రోలర్స్ అందరిని సైలెంట్ చేసే రేంజ్ లో సినిమాకు మెరుపులు దిద్దుతున్నాడు. ఇదిలా ఉంటె ఈ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై రానున్న ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఇదేనంటూ ఓ టాక్ వినిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరా గ్రామంలో.. చేపల వేట కోసం రెండు గ్రామాల మధ్య జరిగే పోరాటం ఇది. దానికి కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇస్తారట. ఈ సినిమాలో రామ్ చరణ్ జాలరిగా నటిస్తున్నాడు. ఇక ఈ తరహా కథ ఆల్రెడీ ఉప్పెనతోనే చూపించాడు బుచ్చి బాబు. ఇప్పడు రామ్ చరణ్ తో కూడా అలాంటి కథే ఉండబోతుందా.. లేదా ఇంకా ఏమైనా కొత్తగా చూపించబోతున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి. గేమ్ ఛేంజర్ మూవీ కనుక హిట్ కొడితే మాత్రం.. RC 16 పై ఇంకాస్త అంచనాలు పెరిగిపోతాయి.

ఏదేమైనా రామ్ చరణ్ పై ఇప్పుడు చాలా ప్రెజర్ ఉందని చెప్పి తీరాల్సిందే. ఎలా అయినా గేమ్ ఛేంజర్ మూవీతో చరణ్ హిట్ కొట్టాల్సిందే. అప్పుడే ఇప్పటివరకు వచ్చిన ట్రోల్స్ అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ప్రస్తుతం టీం అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అటు దర్శకుడు గేమ్ ఛేంజర్ పై అదిరిపోయే టీజర్ కట్ ను రెడీ చేస్తున్నాడు. ఎదో కాలం కలిసి రాక ఇండియన్ 2 ఫెయిల్ అయింది. కానీ .. శంకర్ వర్క్ గురించి తెలియనిది కాదు. ఒక్కసారి టీజర్ బయటకు వస్తే కానీ అసలు గేమ్ స్టార్ అవ్వదు. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఆ తర్వాత చరణ్ ఇమేజ్ ను పెంచే రేంజ్ బుచ్చి బాబు తీసుకుంటాడు. మరి ఈ రెండు సినిమాలు అంచనాలను అందుకుంటాయో లేదో చూడాలి. ముందైతే గేమ్ ఛేంజర్ విషయం తేలాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibom