iDreamPost
android-app
ios-app

బృంద మూవీ విలన్ ఆ స్టార్ హీరో బ్రదరని తెలుసా..?

  • Published Aug 20, 2024 | 4:13 AM Updated Updated Aug 20, 2024 | 4:13 AM

కోలీవుడ్,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన తాజా వెబ్ సిరీస్ బృంద. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించింది త్రిష. ఇక ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన నటుడు ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో బ్రదరని తెలుసా..?

కోలీవుడ్,టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన తాజా వెబ్ సిరీస్ బృంద. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించింది త్రిష. ఇక ఇందులో నెగిటివ్ రోల్ పోషించిన నటుడు ఎవరో తెలుసా..? ఆ స్టార్ హీరో బ్రదరని తెలుసా..?

  • Published Aug 20, 2024 | 4:13 AMUpdated Aug 20, 2024 | 4:13 AM
బృంద మూవీ విలన్ ఆ స్టార్ హీరో బ్రదరని తెలుసా..?

ఓటీటీ వేదికగా ఉమెన్ సెంట్రిక్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఆదరణ బాగా పెరిగింది. అందుకే స్టార్ బ్యూటీలు సైతం నేరుగా ఓటీటీలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కోలీవుడ్,టాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ త్రిష ఓటీటీలోకి ఎంటరైంది. బృంద వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 1న నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ అండ్ థ్రిల్లర్ సిరీస్‌గా వచ్చిన బృంద మంచి వ్యూస్, రేటింగ్ తెచ్చుకుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఇరగదీసింది ఈ స్టార్ హీరోయిన్. ఇక ఇందులో నెగిటివ్ రోల్ చేసిన నటుడు గుర్తున్నాడా..? పైకి మంచి వాడిలా నటించి.. వెనుక క్రైమ్స్ చేయిస్తుంటాడు. ఇంతకు ఆ యాక్టర్.. ఎవరో తెలుసా..? ఓ స్టార్ హీరో బ్రదర్ అని తెలుసా?

డా. సత్య అలియాస్ ప్రొఫెసర్ కబీర్ ఆనంద్ పాత్రలో నటించిన యాక్టర్ ఇంద్రజీత్ సుకుమారన్. మాలీవుడ్ స్టార్ యాక్టర్. చైల్డ్ ఆర్టిస్టు నుండి నటిస్తున్న ఇంద్రజీత్ ఇప్పటికే వందకు పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా, సపోర్టింగ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. కేవలం అతడు నటుడు మాత్రమే కాదు.. సింగర్ కూడా. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఛార్మీ నెగిటివ్ రోల్ పోషించిన కావ్యాస్ డైరీలో యాక్ట్ చేశాడు. ఇందులో మహేష్ బాబు సోదరి మంజులా ఘట్టమనేనికి భర్తగా నటించింది ఇంద్రజిత్తే. ఇందులో విశేషమేమిటంటే.. ఆయన ఫిల్మీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన నటుడు. ఆయన తండ్రి సుకుమారన్ మాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్. ఆయన తల్లి మల్లికా సుకుమారన్ కూడా నటే. ఇక ఆయన భార్య పూర్ణిమా ఇంద్రజీత్ కూడా యాక్టరే.

అయితే మనకు ఇంద్రజీత్ ఇప్పుడు తెలుసు.. కానీ ఆయన స్టార్ హీరో సోదరుడన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దూసుకెళ్తున్న మాలీవుడ్ హీరో పృధ్వీ రాజ్ సుకుమారన్ సోదరుడే ఈ ఇంద్రజీత్. సలార్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు కమ్ బ్యాక్ ఇచ్చినా పృధ్వీ.. ఆ తర్వాత ఆడు జీవితంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. అలాగే గురువాయూర్ అంబలనడియల్ అనే మలయాళ మూవీతో సక్సెస్ కొట్టి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం పృధ్వీ రెండు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఇదే కాకుండా సలార్ 2 కూడా నటించబోతున్నాడు. ఇక అన్నయ్య ఇంద్రజీత్ కూడా మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ అన్నాదమ్ములు అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఎల్ 2: ఎంపూరన్‌లో నటిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Indrajith Sukumaran (@indrajith_s)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş