iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని ఇద్దరూ స్టార్సే.. ఒకరు బుల్లితెరపై, మరొకరు వెండితెరపై

  • Published Aug 04, 2024 | 4:33 PM Updated Updated Aug 04, 2024 | 4:33 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు నటీమణులే. ఒకరు బుల్లితెరపై రాణిస్తుంటే.. మరొకరు వెండితెరపై తన ఛరిష్మాను చూపించేందుకు సిద్ధమౌతున్నారు. ఇంతకు వీళ్లెవరో తెలుసా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు నటీమణులే. ఒకరు బుల్లితెరపై రాణిస్తుంటే.. మరొకరు వెండితెరపై తన ఛరిష్మాను చూపించేందుకు సిద్ధమౌతున్నారు. ఇంతకు వీళ్లెవరో తెలుసా..?

  • Published Aug 04, 2024 | 4:33 PMUpdated Aug 04, 2024 | 4:33 PM
ఈ ఫోటోలోని ఇద్దరూ స్టార్సే.. ఒకరు బుల్లితెరపై, మరొకరు వెండితెరపై

బుల్లితెరపై 2000 దశకంలో ఆకట్టుకున్న సీరియల్స్ చక్రవాకం, మొగలి రేకులు. శ్రీకాంత్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మంజులా నాయుడు తెరకెక్కించారు. బిందు నాయుడు స్టోరీని అందించారు. ఈ రెండు సీరియల్స్ జెమినీ టీవీలో ప్రసారమయ్యి విశేష ఆదరణ చూరగొన్నాయి. అయితే చాలా మందికి చక్రవాకం కన్నా మొగలి రేకులు రిజిస్టర్ అయ్యింది. 2008లో మొదలైన ఈ ధారావాహిక..2013 వరకు నిర్విరామంగా కొనసాగింది. సుమారు 1360 ఎపిసోడ్ల వరకు సీరియల్ ప్రసారం అయ్యింది. ఈ సీరియల్ ఎంత ఫేమస్సో.. ఇందులో నటించిన యాక్టర్స్ కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఇంద్రనీల్, సాగర్, షీలా సింగ్, లిఖిత కామిని, కరుణ, మేథా, రవికృష్ణ వంటి బుల్లితెర స్టార్స్ నటించారు.

ఇదిగో ఈ ఫోటోలో పాపను ఎత్తుకున్న ఈ యువతిని చూశారు కదా.. ఆమె కూడా ఈ సీరియల్ ద్వారానే ఫేమ్ తెచ్చుకుంది. చిన్న వయస్సులోనే పెద్ద క్యారెక్టర్ చేసి మెప్పించింది. ఇప్పటికే అదే బరువైన పాత్రలు చేస్తూ నిత్యం బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, అందులో ఓ అమ్మాయి హీరోయిన్ అయ్యి..ఇటీవల ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకు ఆమె ఎవరంటే.. బుల్లితెరపై అమ్మ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రసైన శ్రీప్రియా శ్రీకర్. ప్రస్తుతం బిగ్ బాస్ ఫేం, బ్రహ్మాముడి సీరియల్లో మానస్ తల్లిగా అపర్ణ పాత్రలో నటించిన యాక్టర్ గుర్తున్నారు కదా.. ఆమెను మీరు ఈ ఫోటోలో చూస్తున్నది. యంగ్ ఏజ్‌లో పిక్ అది. కానీ ఆమె మొగలి రేకులు సీరియల్ నుండి అంటే 2008 నుండే తల్లి క్యారెక్టర్లు చేస్తూనే ఉంది.

సీరియల్ డైరెక్టర్ శ్రీకర్‌ని పెళ్లి చేసుకుంది. సంధ్యారాగం అనే సీరియల్లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని మొగలి రేకులుతో మళ్లీ కెరీర్ స్టార్ట్ చేసింది. అంతులేనికథ, చెల్లెలి కాపురం, సిరి, వైదేహి పరిణయం ధారావాహికలు చేసింది. ఇప్పటి వరకు 30కి పైగా సీరియల్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బ్రహ్మాముడి సీరియల్లో కనిపిస్తుంది. అంతేనా ఈమెకు ఇద్దరు కూతుళ్లు.. వారిలో ఒకరు చరిష్మా శ్రీకర్. ఆమె పలు సినిమాల్లో నటించింది. రుద్రాంగి, లక్ష్మీ కటాక్షం అనే మూవీతో పాటు రీసెంట్‌గా వచ్చిన ప్రేమలో అనే మూవీలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం అమ్మ బుల్లితెరపై రాణిస్తుంటే.. కూతురు చరిష్మా.. వెండితెరపై తన చరిష్మాను చూపేందుకు సిద్దమౌతుంది.

 

View this post on Instagram

 

A post shared by Charishma Shreekhar (@charishmashreekhar)

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş