iDreamPost
android-app
ios-app

బ్రహ్మముడిలో అమాయకంగా ఉండే.. దీపికా రంగరాజు బ్యాగ్రౌండ్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

  • Published Aug 09, 2024 | 8:14 PM Updated Updated Aug 09, 2024 | 8:14 PM

Brahamamudi Fame Deepika Rangaraju Background: బ్రహ్మముడి సీరియల్ అంటే ఇప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఒక ఎమోషన్ అయిపోయింది. అలాగే ఈ సీరియల్ కావ్యగా చేస్తున్న దీపికా రంగరాజు కూడా ఫేవరెట్ అయిపోయింది. మరి.. సీరియల్ లో అంత అమాయకంగా ఉండే దీపిక బ్యాగ్రౌండ్ మీకు తెలుసా?

Brahamamudi Fame Deepika Rangaraju Background: బ్రహ్మముడి సీరియల్ అంటే ఇప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఒక ఎమోషన్ అయిపోయింది. అలాగే ఈ సీరియల్ కావ్యగా చేస్తున్న దీపికా రంగరాజు కూడా ఫేవరెట్ అయిపోయింది. మరి.. సీరియల్ లో అంత అమాయకంగా ఉండే దీపిక బ్యాగ్రౌండ్ మీకు తెలుసా?

  • Published Aug 09, 2024 | 8:14 PMUpdated Aug 09, 2024 | 8:14 PM
బ్రహ్మముడిలో అమాయకంగా ఉండే.. దీపికా రంగరాజు బ్యాగ్రౌండ్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే ఎంత పిచ్చి ఉంటుందో.. అలాగే సీరియల్స్ అంటే కూడా అంతే ఇష్టం ఉంటుంది. ఇప్పటికీ తమ అభిమాన సీరియల్ వస్తోంది అంటే.. టీవీని వదలకుండా ఉండే మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు సీరియల్స్ క్రేజ్ మారిపోయింది. కేవలం ఆడవాళ్లే కాదండోయ్.. ఇంట్లో ఉన్న మగవాళ్లు కూడా టీవీ సీరియల్స్ కు అడిక్ట్ అయిపోయారు. అలాంటి పరిస్థితులు రావడానికి ఈ బ్రహ్మముడి సీరియల్ కూడా ఒక కారణం అని చెప్పచ్చు. ఈ సీరియల్ టాప్ రేటెడ్ గా నిలవడానికి అన్నీ కేటగిరీల ఆడియన్స్ ని మెప్పించడం కూడా ఒక కారణం. అందులో మరీ ముఖ్యంగా కావ్య పాత్ర చేస్తున్న దీపికా రంగరాజు కూడా ఒక రీజన్ అని చెప్పచ్చు. బ్రహ్మముడిలో ఎంతో అమాయకంగా కనిపించే దీపిక బ్యాగ్రౌండ్ చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే.

బ్రహ్మముడితో:

దీపికా రంగరాజు తెలుగులో చేస్తున్న ఏకైక సీరియల్ బ్రహ్మముడి. ఈ అమ్మడును దీపిక అని చెప్తే ఎవరైనా గుర్తుపడతారో లేదో గానీ.. కావ్య అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఇట్టే కనిపెట్టేస్తారు. బ్రహ్మముడి సీరియల్ లో ఈమె క్యారెక్టర్ చుట్టూనే సీరియల్ నడుస్తూ ఉంటుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ బుల్లితెర స్టార్ మానస్ నాగులపల్లికి పెయిర్ గా దీపిక చేస్తోంది. అతని ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా యాక్టింగ్ చేస్తుంటుంది. అలాగే కావ్య పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. అమాయకత్వం, నిజాయతీ, మెట్టినింటి పరువు, పుట్టినింటి బాధ్యత, అక్కాచెల్లి కాపురాలను చక్కదిద్దడం.. ఇలా చాలానే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నిజానికి సీరియల్ మొత్తాన్ని తన భుజాల మీద మోస్తోంది అని కూడా చెప్పచ్చు.

సీరియల్స్- మూవీస్:

కావ్యలాంటి పాత్రకు ఒక ఆర్టిస్టును సెలక్ట్ చేస్తున్నారు అంటే కచ్చితంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉంటారు. అందులో భాగంగానే దీపికా రంగరాజను ఎంచుకున్నారు. వారి ఎంపిక ఏమాత్రం తప్పుకాలేదు అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు టాప్ రేటెడ్ సీరియల్ గా ఉంది అంటే దీపిక కూడా కారణం కాబట్టి.  ఇంక దీపికా రంగరాజు తమిళ్ లో చితిరం పేసుతాడి అనే సీరియల్ లో ఐపీఎస్ అధికారిగా మెప్పించింది. ఆ సీరియల్ తో తమిళ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. దీపిక ఆరాడి అనే ఒక మూవీ కూడా చేసింది. ఆ సినిమా అవార్డులు, నామినేషన్స్ కూడా లభించాయి. అప్పటి నుంచే తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడం స్టార్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Deepika Rangaraju (@deepika_rangaraju)

రియాలిటీ షోస్:

బహ్మముడి సీరియల్ లో ఎప్పుడూ అమాయకంగా కనిపించే కావ్య ఎంత అల్లరి పిల్ల అనే విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ టీవీ ఛానల్ లో వచ్చే షోస్ లో దాదాపుగా దీపిక రంగరాజు ఉంటుంది. ఆమె ఉండకపోతే ఆ షోలో మజా ఉండదు అనే పరిస్థితికి ఆడియన్స్ వచ్చేశారు. నాకు ఏం వచ్చు.. ఏం రాదు.. అనే విషయాన్ని అస్సలు పట్టించుకోదు. తనకు నచ్చినట్లు పాడేస్తుంది. వచ్చినట్లు డ్యాన్స్ చేస్తుంది. మొత్తానికి షోలో ఉన్నంతసేపు రచ్చ రచ్చ చేసేస్తుంది. అందుకే దీపికా రంగరాజు పేరు బిగ్ బాస్ 8కి వెళ్తున్న లిస్టులోకి కూడా వచ్చేసింది. కానీ, ఆమె దాదాపుగా వెళ్లే అవకాశం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే బ్రహ్మముడి సీరియల్ ని కాదని.. ఆమెను ఇప్పుడు బిగ్ బాస్ కి తీసుకెళ్లే ధైర్యం చేయకపోవచ్చు. అటు సోషల్ మీడియాలో కూడా దీపికా రంగరాజు అలరిస్తూనే ఉంటుంది. ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్ అంటూ తెలుగు ప్రేక్షకులను ఎప్పిటికప్పుడు తన టాలెంట్ తో మెప్పిస్తూనే ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Deepika Rangaraju (@deepika_rangaraju)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş