iDreamPost
android-app
ios-app

‘కుక్కతో శోభనం’.. మీరు ట్రై చేయండంటూ సురేష్‌ కొండేటికి బ్రహ్మాజీ సలహా!

  • Published Jul 11, 2023 | 2:19 PM Updated Updated Jul 11, 2023 | 2:19 PM
  • Published Jul 11, 2023 | 2:19 PMUpdated Jul 11, 2023 | 2:19 PM
‘కుక్కతో శోభనం’.. మీరు ట్రై చేయండంటూ సురేష్‌ కొండేటికి బ్రహ్మాజీ సలహా!

ఈమధ్య కాలంలో సినిమాలు తీయడం కన్నా కూడా దాని ప్రమోషన్‌ కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచి ప్రమోషన్‌ వర్క్స్‌ ప్రారంభమవుతున్నాయి. ఎంత ఎక్కువ ప్రమోషన్‌ చేస్తే.. సినిమా మీద అంత హైప్‌ క్రియేట్‌ అవుతుంది. అప్పుడే ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ బ్రహ్మండంగా ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో మూవీ ప్రమోషన్స్‌ డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రాంక్‌ వీడియోలు కూడా చేస్తున్నారు. ఇక తాజాగా రంగబలి సినిమా ప్రమోషన్స్‌ కోసం ఏకంగా సీనియర్‌ జర్నలిస్ట్‌లను ఇమిటేట్‌ చేస్తూ.. సత్య చేసిన స్పూఫ్‌లు బాగా క్లిక్‌ అయ్యాయి. ఆ విషయం కాసేపు పక్కకు పెడితే.. మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన రిపోర్టర్లతో ప్రెస్‌ మీట్‌ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురేష్‌ కొండేటి.

డీజే టిల్లు సినిమా ప్రమోషన్స్‌ సమయం నుంచి ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ప్రెస్‌మీట్‌లో ఉన్నాడంటే ఏదో ఒక బోల్డ్‌ క్వశ్చన్‌ అడుగుతాడని ముందే ఊహిస్తున్నారు. ఆయన తీరుపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత ట్రోలింగ్‌ జరిగినా సురేష్‌ కొండేటి మాత్రం తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా సురేష్‌ కొండేటికి.. బిగ్‌ షాక్‌ ఇచ్చారు సీనియర్‌ నటుడు బ్రహ్మాజీ. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ప్రస్తుతం బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, ప్రణవి మానుకొండ ప్రధాన పాత్రల్లో ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్’ మూవీ తెరకెక్కింది. పూరీ జగన్నాథ్ శిష్యుడు ఏ ఆర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జూలై 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. దీనికి సురేష్‌ కొండేటి కూడా హాజరయ్యారు. ఇక చిత్ర బృందాన్ని ప్రశ్నించడానికి ఆయన మైక్‌ అందుకున్నారు. ఇది గమనించిన బ్రహ్మాజీ.. సురేష్‌ కొండేటి అడగబోయే ప్రశ్న ఏంటో తనకు తెలుసు అని షాకిచ్చాడు. ‘‘ఇప్పుడు సురేష్‌ కొండేటి.. హీరోను ఉద్దేశించి ఈ సినిమాలో మీకు కుక్కతో పెళ్లి అయ్యింది.. శోభనం కూడా జరిగింది కదా.. ఎలా జరిగింది అని అడుగుతాడు’’ అని బ్రహ్మాజీ చెప్పడంతో సురేష్‌ కొండేటితో పాటు అందరూ షాక్‌ అయ్యారు.

ఆ తర్వాత సురేష్‌ కొండేటి తేరుకుని.. జవాబు కూడా మీరే చెప్పండి అని బ్రహ్మాజీని అనడంతో.. అందుకు ఆయన.. చాలా బాగుందండి.. మీరు కూడా ఓసారి ట్రై చేయండి అని చెప్తానంటూ.. నవ్వుతూనే సురేష్‌ కొండేటి నోరు మూయించారు బ్రహ్మాజీ. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. కరెక్ట్‌ సమాధానం చెప్పారు.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు జనాలు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet