iDreamPost
android-app
ios-app

ఘనంగా బ్రహ్మముడి మానస్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?

  • Published Sep 02, 2023 | 6:07 PM Updated Updated Sep 02, 2023 | 6:07 PM
  • Published Sep 02, 2023 | 6:07 PMUpdated Sep 02, 2023 | 6:07 PM
ఘనంగా బ్రహ్మముడి మానస్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?

చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో స్టార్ అవుతారన్న కచ్చితమైన దఖలాలు లేవు. నటనతో పాటు కాస్తంత అదృష్టం కూడా కలిసి రావాల్సిందే. వెండితెరపై అడపా దడపా సినిమాలు చేసి.. అక్కడ లక్ కలిసి రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలి పెట్టి వెళ్లలేక బుల్లితెర వైపు చూస్తున్నారు కొంత మంది యంగ్ నటులు. టాలెంట్ ఉన్న వెనుక గాఢ్ పాదర్స్, సరైన పరిచయాలు లేకపోవడంతో హీరో అవుదామని వచ్చి.. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లతో సరిపెట్టుకుని, ఆపై టీవీ రంగంలో రాణిస్తున్నారు. అటువంటి నటుల్లో ఒకరు మానస్. చైల్డ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత హీరోగా సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన మానస్.. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, సోడా గోలి సోడా, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించాడు. కాయ్ రాజా కాయ్‌లో అతడికి కాస్తంత గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. క్షీర సాగర మథనం అనే సినిమాలో హీరోగా కనిపించాడు. కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు లేక బుల్లితెరలో పలు సీరియల్స్ చేస్తూ వస్తున్నాడు.

కోయిలమ్మ, పితృదేవోభవ, దీపారాధన వంటి సీరియల్స్‌లో నటించారు. ఆ తర్వాత బిగ్ బాస్ 5లోకి అడుగుపెట్టాడు. ఫైనల్ వరకు చేరి మెప్పించాడు. స్ట్రాంగ్ మైండ్ తో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక స్పెషల్ సాంగ్స్ చేస్తూ లైమ్ లైట్‌లో నిలుస్తూ వస్తున్నాడు. యాంకర్ విష్ణు ప్రియతో కలిసి జరీ జరీ పంచె కట్టి, గంగులు సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత బ్రహ్మముడి సీరియల్స్ ద్వారా ఇంటిల్లి పాదినీ అలరిస్తున్నాడు. ఇప్పుడు ఈ నటుడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా అతడి నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడు మనువాడబోయే అమ్మాయి పేరు శ్రీజ నిశ్శంకరరావు. ఈ ఎంగేజ్ మెంట్‌కు బిగ్ బాస్ ఫ్రెండ్స్.. యాంకర్ కాజోల్, సన్నీ హాజరయ్యారు. ఈ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by 🌟 sunny & maanas 🌟 (@mansun_warriors)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom