iDreamPost
android-app
ios-app

రెండు రోజుల్లో ఓం భీమ్ బుష్ ఎంత కలెక్ట్‌ చేసిందంటే

  • Published Mar 24, 2024 | 11:45 AM Updated Updated Mar 24, 2024 | 11:45 AM

Om Bheem Bhush: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ ప్రధానంగా కామెడీ సినిమాగా తెరకెక్కిన ఓం భీమ్ బుష్ లో ఎవరూ టచ్ చేయటానికి సాహసించని కాన్సెప్ట్ కూడా ఉంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కూడా జోరు అందుకుంది.

Om Bheem Bhush: నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ ప్రధానంగా కామెడీ సినిమాగా తెరకెక్కిన ఓం భీమ్ బుష్ లో ఎవరూ టచ్ చేయటానికి సాహసించని కాన్సెప్ట్ కూడా ఉంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కూడా జోరు అందుకుంది.

  • Published Mar 24, 2024 | 11:45 AMUpdated Mar 24, 2024 | 11:45 AM
రెండు రోజుల్లో ఓం భీమ్ బుష్ ఎంత కలెక్ట్‌ చేసిందంటే

ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సరికొత్త సాలిడ్ ఎంటర్‌టైనర్ ఓం భీమ్ బుష్. శ్రీవిష్ణు, ప్రియదర్శితో పాటు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ ప్రధానంగా కామెడీ సినిమాగా తెరకెక్కిన ఓం భీమ్ బుష్ లో ఎవరూ టచ్ చేయటానికి సాహసించని కాన్సెప్ట్ కూడా ఉంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కూడా జోరు అందుకుంది.

మొదటి నుండి ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా మార్చి 22న విడుదలై అంచనాలను అందుకొని టికెట్ కౌంటర్ల వద్ద సాలిడ్ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజున 4 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసిన ఓం భీమ్ బుష్ రెండవ రోజు మరింత ఊపందుకుంది. రెండవ రోజు 6 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10.44 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈరోజు ఆదివారం అవడంతో పాటు రేపు హోలీ పండగ సెలవుని కూడా ఉపయోగించుకుని మరిన్ని కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

సన్నీ ఎంఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, వి సెల్యులాయిడ్ తో పాటు యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. బ్యాంగ్ బ్రోస్ అనే పేరుతో భైరవపురంలో మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించే ముగ్గురు యువకుల కథగా ఓం భీమ్ బుష్ తెరకెక్కింది. మొదటి నుంచీ ఈ సినిమాలో కామెడీ తప్ప పెద్దగా కథ ఏమీ ఉండదని చిత్ర బృందం చెప్తూ వచ్చింది. అయితే విడుదలకు ముందు సినిమాకి సంభందించిన ఒక ఎమోషనల్ లైన్ బయటకి రాకుండా చూసుకున్నారు. సెకండాఫ్ లో వచ్చే ఆ ఎమోషనల్ టచ్ సినిమాని ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యేలా చేసింది. సామజవరగమన సినిమాతో ఇటీవలే భారీ హిట్ అందుకున్న హీరో శ్రీ విష్ణు కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచే దిశగా దూసుకుపోతోంది ఓం భీమ్ బుష్.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis