iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. స్పందించిన ప్రముఖ నటి!

  • Published Jul 14, 2023 | 9:57 PM Updated Updated Jul 14, 2023 | 9:57 PM
  • Published Jul 14, 2023 | 9:57 PMUpdated Jul 14, 2023 | 9:57 PM
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్.. స్పందించిన ప్రముఖ నటి!

రాజశ్రీ ఠాకూర్.. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి పలు ప్రకటనలు చేసింది. ఆ తర్వాత కొన్ని సీరియల్ లో నటించింది. ఇక 2004లో వచ్చిన హవా అనీ దే మూవీతో ఈ హీరోయిన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే.. కాస్టింగ్ కౌచ్ అంశంపై ఇండస్ట్రీలో ఇప్పటికీ ఎంతో మంది హీరోయిన్స్ స్పందించి తమ గొంతు వినిపించారు. నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగు పెట్టి చివరికి లైంగిక వేధింపులకు గురయ్యామని ఎంతో మంది హీరోయిన్స్ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి మొదలు కుని అటు బాలీవుడ్ వరకు అన్నీ చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్స్ అనేక రకాలు ఇబ్బందులు ఎదుర్కున్నారని వాపోయారు.

ఈ క్రమంలోనే కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది ప్రముఖ నటి రాజశ్రీ ఠాకూర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ అంశంపై స్పందించి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో గత కొన్నేళ్ల నుంచి కాస్టింగ్ కౌచ్ కొనసాగుతూనే ఉందని, ఎంతో మంది హీరోయిన్స్ ఆ వేధింపులకు గురైన వాళ్లేనని తెలిపింది. నేను మోడలింగ్ పై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాను. దీంతో పాటు పలు ప్రకటనలతో పాటు, కొన్ని చిత్రాల్లో కూడా నటించానని తెలిపింది. ఈ క్రమంలోనే నేను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కున్నానని ఆమె పెదవి విప్పింది. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ట్రాప్ చేసి నన్ను వాడుకోవాలని చూశారని, దీంతో నేను ముందే పసిగట్టి ఆ వ్యక్తులకు దూరంగా ఉన్నానని నటి రాజశ్రీ ఠాకూర్ తెలిపింది.

ఇది కూడా చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు! వీడియో పోస్ట్ చేసిన సన్నీలియోన్

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş