iDreamPost
android-app
ios-app

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలపై జెనీలియా షాకింగ్ కామెంట్స్!

  • Published Jul 21, 2023 | 7:11 PM Updated Updated Jul 21, 2023 | 7:11 PM
  • Published Jul 21, 2023 | 7:11 PMUpdated Jul 21, 2023 | 7:11 PM
ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలపై జెనీలియా షాకింగ్ కామెంట్స్!

జెనీలియా.. సత్యం సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలో మంచి నటిగా పేరును మూటగట్టుకుంది.ఆ తర్వాత వచ్చిన హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, ఆరేంజ్ వంటి చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ఇక బొమ్మరిల్లు చిత్రానికి గాను జెనీలియా ఉత్తమ నటిగా తన మొదటి ఫిలిం ఫేర్ అవార్డును సైతం అందుకుంది. ఇలా తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు పొంది అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కూడా ఎదిగింది. అలా కొంత కాలానికి జెనీలియా బాలీవుడ్ నటుడైన రితేష్ దేశముఖ్ ని వివాహం చేసుకుంది. ఇక వివాహ అనంతరం కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అందాల సుందరి.. గతేడాది తన భర్తతో కలిసి వేద్ అనే సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.

ఇదిలా ఉంటే.. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ట్రయల్ పీరియడ్”. ఇది జూలై 21న ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ క్రమంలోనే జెనీలియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథ. ఈ కథ చదివి కేవలం గంటలోనే ఓకే చేశాను. ఎందుకో నాకు ఈ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీలో కుటుంబంతో కలిసి చూసే కథలు రావడం లేదు. దీంతో ఇంట్లో పిల్లలతో కలిసి చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడలేకపోతున్నాము. అందుకే కుటుంబ సభ్యులతో కలిసి చూసేలా ఈ ట్రయిల్ పీరియడ్ కథ చేయడానికి ఓకే చేశానని జెనీలియా చెప్పుకొచ్చింది. ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, సిరీస్ లపై జెనీలియా చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో కాస్త వైరల్ గా మారాయి. ఈమె వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

ఇది కూడా చదవండి: SKN కష్టాలు చెబుతూ బన్నీ ఎమోషనల్.. ఇప్పటికి గుర్తింపు వచ్చింది!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss