iDreamPost
android-app
ios-app

దుమ్మురేపుతున్న దేవర.. ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాకుండానే బుక్ మై షో క్రాష్..

  • Published Sep 16, 2024 | 2:06 PM Updated Updated Sep 16, 2024 | 2:06 PM

జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం దేవర పార్ట్ 1. ఓవర్సీస్ లో ఫ్రీ బుకింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో అప్డేట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే..

జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం దేవర పార్ట్ 1. ఓవర్సీస్ లో ఫ్రీ బుకింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో అప్డేట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే..

  • Published Sep 16, 2024 | 2:06 PMUpdated Sep 16, 2024 | 2:06 PM
దుమ్మురేపుతున్న దేవర.. ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాకుండానే బుక్ మై షో క్రాష్..

ఆర్ఆర్ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాసెస్ తారక్ నుండి రాబోతున్న సినిమా దేవర పార్ట్ 1. ఆరేళ్ల తర్వాత (అరవింద సమేత వీర రాఘవ) సోలో హీరోగా వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. టీజర్, సాంగ్స్ మాత్రమే కాదు.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరోసారి ఊరమాస్ యంగ్ టైగర్‌ను చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుంది. ఇక్కడే కాదు.. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా.. ఓ రేంజ్‌లో సేల్ అవుతున్నాయి.

దేవర మూవీని ఓవర్సీస్‌లో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగానే.. రికార్డులు మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అమెరికాలో అత్యంత వేగంగా 15 వేలు, 20 వేలు, 35 వేటు టికెట్లు సేలైన సినిమాగా దేవర నిలిచింది. ఇప్పుడు 40 వేలకు పైగా టికెట్ల సేల్స్‌తో రికార్డులు సృష్టించింది. అంటే.. తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్న మూవీగా నిలిస్తుంది దేవర. అలాగే ఫాస్టెస్ట్ 1 అండ్ 1.5 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. యుకే, ఆస్ట్రేలియాలో కూడా దేవరదే హహ కొనసాగిస్తుంది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఫ్రీ బుకింగ్ సేల్స్‌లో అదరగొట్టేస్తుంది. అలాగే ఇండియా బాక్సాఫీసు మీద కూడా తన మార్క్ చూపిస్తున్నాడు తారక్. ఈ సినిమా ఫ్రీ బుకింగ్ టికెట్ల కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.

అలాగే బుక్ మైషోలో ఎప్పుడు టికెట్స్ సేల్ స్టార్ట్ అవుతుంది అంటూ సెర్చ్ చేస్తున్నారు. సినిమా అప్ డేట్ కోసం ఒక్కసారిగా ఈ సైట్ పై పడటంతో అలజడి మొదలై.. సైట్ క్రాష్ అయ్యింది. ఇది చూస్తుంటే తారక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. తొలి రోజు వంద కోట్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు. మొత్తానికి దేవర ఊచకోత ఫ్రీ బుకింగ్స్ నుండే మొదలయ్యింది. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి విదితమే. మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో మెరుస్తున్నాడు. ఈ ఇద్దరు ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్నారు. యువసుధ,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ తెరకెక్కిస్తున్నారు.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş