iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ హీరోల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోలు

  • Published Nov 20, 2024 | 3:32 PM Updated Updated Nov 20, 2024 | 3:32 PM

ఉత్తరాది రాష్ట్రాలను ఈ ఇద్దరు హీరోలు టార్గెట్ చేశారా! ఈ విషయంలో హీరోలిద్దరూ పోటా పోటీగా వెళ్తున్నారా ! అంటే అవుననే చెప్పాలి. అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ తో.. ఇటు బన్నీ పుష్ప 2 ట్రైలర్ తో అక్కడ అభిమానులతో మాట మంతి చేశారు. అదే ఇప్పుడు బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది.

ఉత్తరాది రాష్ట్రాలను ఈ ఇద్దరు హీరోలు టార్గెట్ చేశారా! ఈ విషయంలో హీరోలిద్దరూ పోటా పోటీగా వెళ్తున్నారా ! అంటే అవుననే చెప్పాలి. అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ తో.. ఇటు బన్నీ పుష్ప 2 ట్రైలర్ తో అక్కడ అభిమానులతో మాట మంతి చేశారు. అదే ఇప్పుడు బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది.

  • Published Nov 20, 2024 | 3:32 PMUpdated Nov 20, 2024 | 3:32 PM
బాలీవుడ్ హీరోల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోలు

ఉత్తరాది రాష్ట్రాలను ఈ ఇద్దరు హీరోలు టార్గెట్ చేశారా! ఈ విషయంలో హీరోలిద్దరూ పోటా పోటీగా వెళ్తున్నారా ! అంటే అవుననే చెప్పాలి. అటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ తో.. ఇటు బన్నీ పుష్ప 2 ట్రైలర్ తో అక్కడ అభిమానులతో మాట మంతి చేశారు. అదే ఇప్పుడు బాలీవుడ్ హీరోల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుంది. బాలీవుడ్ మూవీస్ పబ్లిసిటీ ఎలా ఉంటుంది అనేది తెలిసిందే. అక్కడ భారీ ఎత్తున ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరగవు. అభిమానులతో సరైన ఇంటరాక్షన్ ఉండదు. ఒకవేల ఉన్నా కూడా అది కేవలం చాలా పరిమితంగా ఉంటుంది. చాలా వరకు నేరుగా కాకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ద్వారానే హీరోలు ముందుకు వస్తూ ఉంటారు. ఇక రియాలిటీ షోస్ ద్వారా సినిమాను పబ్లిసిటీ చేసుకుంటారు. స్పెషల్ గా సినిమాను ప్రేక్షకులలోకి తీసుకుని వెళ్లాలనే ప్లాన్స్ అయితే అక్కడ ఉండవు. ఎదో సినిమా రిలీజ్ టైం లో మాత్రమే అక్కడ కాస్త హంగామా కనిపిస్తుంది. కానీ టాలీవుడ్ దానికి కంప్లీట్ రివర్స్ లో ఉంటుంది.

ఇక్కడ వారికి సినిమా అంటే పండగ. కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ఇక్కడ హడావిడి స్టార్ట్ అవుతుంది. లిరికల్ సాంగ్స్ నుంచి ట్రైలర్ వరకు ఒక్కొక్కటి చాలా ప్రత్యేకంగా జనాల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఫైనల్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ క్లోజ్ చేస్తారు. సరిగ్గా ఇదే స్ట్రాటజీని ఇప్పుడు చరణ్ , బన్నీ నార్త్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏకంగా బీహార్ , ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో భారీగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు తెలుగు హీరోలు. మాస్ ఆడియన్స్ కు ఈ సినిమాల కంటెంట్ రీచ్ అయ్యేలా పక్కా స్కెచ్ ను ప్రిపేర్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఈవెంట్స్ , ప్లానింగ్స్ బాలీవుడ్ గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయా ? అంటే జరుగుతున్న సన్నివేశాలు అలాగే కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ కనుక తమ పద్దతి మార్చుకోకపోతే.. కాస్త ప్రమాదమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత భాషల హీరోల కంటే కూడా.. ఇతర భాషల హీరోల కోసం అంత మంది అభిమానులు రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాళ్ళకు ఈ ఎక్స్పీరియన్స్ కొత్తనా! లేక మన హీరోల మీద ప్రేమతో బయటకు వస్తున్నారా ! అనేదే తెలియదు కానీ.. ఇదే కనుక కంటిన్యు అయితే ఇక టాలీవుడ్ సినిమా రేంజ్ ను తగ్గించడం ఎవరి వలన కాదు.

యూపీ భారీ ఎత్తున జనాభా ఉన్న రాష్ట్రం . అక్కడ ఉన్న కొన్ని రాష్ట్రాలతో దేశ సరిహద్దు లింక్ అయ్యి ఉంటుంది. ఇలాంటివే గేమ్ ఛేంజర్ టీజర్ ను అక్కడ వరకు తీసుకుని వెళ్లాయని.. విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీహార్ అంటే వెనుకబడిన రాష్ట్రము. దొంగలు , దోపీడితనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పుష్ప 2 లో కూడా ఇంచు మించు ఇలాంటి కంటెంట్ ఏ ఉంటుంది. సో అలాంటి ప్లేస్ లో ఈ కంటెంట్ రీచ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంది. ఇలా ఈ హీరోలిద్దరూ కూడా పక్కా ప్లానింగ్ తో యూనిక్ స్టయిల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే తరహాలో పాన్ ఇండియా సినిమాలను ప్రమోట్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.