iDreamPost
android-app
ios-app

ఆ సమయంలో సిగిరెట్ కు అలవాటు పడ్డాను: స్టార్ హీరోయిన్

  • Published Apr 26, 2024 | 7:12 PM Updated Updated Apr 26, 2024 | 7:12 PM

సాధారణంగా ఇండస్ట్రీలో కొనసాగే తారలకు ఒక్కొక్కరికి ఒకే రకమైన అలవాటులు ఉంటాయి. అయితే ఆ అలవాటులు అనేవి కొన్ని మంచివి అయితే, మరికొన్ని చెడ్డవి కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు అది చాలా ఇష్టమని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకి ఎవరంటే..

సాధారణంగా ఇండస్ట్రీలో కొనసాగే తారలకు ఒక్కొక్కరికి ఒకే రకమైన అలవాటులు ఉంటాయి. అయితే ఆ అలవాటులు అనేవి కొన్ని మంచివి అయితే, మరికొన్ని చెడ్డవి కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకు అది చాలా ఇష్టమని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకి ఎవరంటే..

  • Published Apr 26, 2024 | 7:12 PMUpdated Apr 26, 2024 | 7:12 PM
ఆ సమయంలో సిగిరెట్ కు అలవాటు పడ్డాను: స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ‘విద్యాబాలన్’.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఒరియెంటెడ్ చిత్రాలతో విద్యా తనదైన మార్క్ ను వేసుకున్నారు. అలాగే బయోపిక్ సినిమాలతో కూడా ఈ అమ్మాడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక ఈమె అందం, అద్భుతమైన నటనకుగాను ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఎన్నో బయోపిక్స్ లో నటించిన గుర్తింపు రాని విద్య బాలన్ కు.. సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్ తో ఓవర్ నైట్ స్టార్ గా ఈ పేరు మారుమోగిపోయింది. ఇక ఈ మూవీతో విద్యాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుందనే చెప్పాలి. ఆ తర్వాత కహానీ మూవీతో మరోసారి విద్యా బాలన్ తనెంటో నిరూపించుకుంది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మాడుకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్ అది చాల ఇష్టం అంటూ తనకున్న బ్యాడ్ హెబిట్ గురించి చెబుతూ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా ఇండస్ట్రీలో కొనసాగే తారలకు ఒక్కొక్కరికి ఒకే రకమైన అలవాటులు ఉంటాయి. అయితే ఆ అలవాటులు అనేవి కొన్ని మంచివి అయితే, మరికొన్ని చెడ్డవి కూడా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సినిమా వాళ్ల రూటే సెపరేట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇక్కడ మగవారైనా, అడవారైనా.. పొగ తాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు చాలామందికి ఉంటాయి. అయితే ఈ అలవాట్లు అనేవి కొంతమందికి లేకపోయినా సరే.. కథ డిమాండ్‌ చేస్తే కళ్లు మూసుకుని ఫాలో అయిపోతారు. అలాంటి సమయంలో ఇష్టం లేకపోయినా సరే ముక్కు మూససుకుని మందు తాగేస్తారు. అలాగే కొందరు కష్టంగా ఉన్నా దమ్ము కొడతారు. ఇక సినిమా అయిపోయాక వాటిని వదిలి పెట్టడం అంత ఈజీ అయిన పని కాదు.  ఇటీవలే బాలీవుడ్ నటి విద్య బాలన్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పుకొచ్చింది.

కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘సిగరెట్‌ ఎలా తాగుతారో తెలుసు కానీ నేను  ఎప్పుడూ దాన్ని ట్రై చేయలేదు. కాగా, డర్టీ పిక్చర్‌ సినిమాలో నేను స్మోక్ చేయాల్సి వచ్చింది. అయితే ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదు.  అందుకే నేను సిగరెట్‌ తాగడం నేర్చుకున్నాను. ఇక ఆ సినిమా తర్వాత దానికి ఎంతలా అడిక్ట్ అయిపోయనంటే.. రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదు. కానీ, అప్పట్లో ఆడవాళ్లు ధూమపానం చేస్తే ఎంతో పెద్ద నేరంగా చూసేవారు. ఇప్పుడు ఆ ధోరణి కాస్త తగ్గిందనుకోండి.

అయితే ధూమపానం ఆరోగ్యానికి హానికరమేమీ కాదని ఎవరైనా చెప్పుంటే.. ఇప్పటికీ ఆ అలవాటుకు బానిసగానే ఉండేదాన్ని. ఇక ప్రస్తుతం మాత్రం సిగరెట్లు తాగడం లేదు. ఇక కాలేజీ చదివే రోజుల్లో బస్‌ స్టాప్‌లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగ ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు బాగా నచ్చేది’ అని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన దో ఔర్‌ దో ప్యార్‌ సినిమా ప్రస్తుతం థియేటర్లలో రన్‌ అవుతోంది. కాగా, మిక్స్‌డ్‌ రివ్యూస్‌ అందుకున్న ఈ చిత్రం వారం రోజుల్లో కేవలం రూ.3.32 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మరి, బాలీవుడ్ నటి విద్యాబాలన్ సిగరెట్ అలవాటు పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişberlinbet girişgrandpashabet