iDreamPost
android-app
ios-app

Maharaja Remake: ఆ స్టార్ హీరో చేతికి మహారాజ మూవీ బాలీవుడ్ రీమేక్ రైట్స్

  • Published Jul 28, 2024 | 11:46 AM Updated Updated Jul 28, 2024 | 11:46 AM

ఒక భాషలో సూపర్ హిట్ అయినా సినిమాను కచ్చితంగా రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సైలెంట్ గా థియేటర్స్ లో సూపర్ హిట్ అయినా మూవీ మహారాజ. దీనిని ఇప్పుడు హిందీలో ఓ ప్రముఖ హీరో రీమేక్ చేయనున్నారట. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ఒక భాషలో సూపర్ హిట్ అయినా సినిమాను కచ్చితంగా రీమేక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సైలెంట్ గా థియేటర్స్ లో సూపర్ హిట్ అయినా మూవీ మహారాజ. దీనిని ఇప్పుడు హిందీలో ఓ ప్రముఖ హీరో రీమేక్ చేయనున్నారట. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

  • Published Jul 28, 2024 | 11:46 AMUpdated Jul 28, 2024 | 11:46 AM
Maharaja Remake: ఆ స్టార్ హీరో చేతికి  మహారాజ మూవీ బాలీవుడ్ రీమేక్ రైట్స్

ఇండస్ట్రీ రీమేక్ సినిమాలు చాలానే ఉన్నాయన్న సంగతి తెలియనిది కాదు. ఏదైనా సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించిందంటే. కచ్చితంగా మరొక లాంగ్వేజ్ లో ఆ సినిమా రీమేక్ వెర్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రీమేక్ లిస్ట్ లోకి రీసెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మహారాజ మూవీ కూడా యాడ్ అయింది. అసలు ఎటువంటి అంచనాలు లేకుండా… విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత ఈ మూవీ రేంజ్ నెక్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో ఓ ప్రముఖ స్టార్ రీమేక్ చేయనున్నారట. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

విజయ్ సేతుపతి కెరీర్ లో 50 వ చిత్రంగా విడుదలైన మహారాజ మూవీ.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.20 కోట్లతో రూపొందించిన ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా ఈ మూవీ నిలిచిపోయింది. స్క్రీన్ ప్లే, నటి నటులు యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్కదానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ రీమేక్ చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ హిందీ రైట్స్ ను అమీర్ ఖాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అప్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

Aamir khan

ఇక అమీర్ ఖాన్ విషయానికొస్తే.. బాలీవుడ్ ఈ హీరో కు సంబంధించిన హిట్ మూవీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అందులోను ఇలాంటి వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకోవడంలో అమీర్ ఎప్పుడు ముందుటారు. ఆల్రెడీ దంగల్ సినిమాతో.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వసూళ్లను సాధించి సక్సెస్ సాధించిన సంగతి తెలియనిది కాదు. ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్న ప్రకారం మహారాజ మూవీని కూడా రీమేక్ చేస్తే మాత్రం.. ఇదే రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet