iDreamPost
android-app
ios-app

తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్.. వెరైటీ పోస్ట్ వైరల్

  • Published Feb 29, 2024 | 11:24 AM Updated Updated Feb 29, 2024 | 11:24 AM

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ -రణ్ వీర్ సింగ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. డెలివరీ డేట్ ను కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ -రణ్ వీర్ సింగ్ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. డెలివరీ డేట్ ను కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.

తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్.. వెరైటీ పోస్ట్ వైరల్

బాలీవుడ్ స్టార్ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. కొద్ది రోజులుగా దీపికా పదుకోన్-రణ్ వీర్ దంపతులు పేరెంట్స్ క్లబ్ లోకి చేరబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఇటీవలే ఫిబ్రవరి 18 న లండన్ లో జరిగిన బాఫ్టా కార్యక్రమంలో దీపికా హోస్ట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో దీపికా.. తన చీర కొంగుతో బేబీ బంప్ ను దాచడానికి ప్రయత్నించారంటూ గాసిప్స్ మొదలయ్యాయి. ఇక ఈ అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ సోషల్ మీడియా వేదికగా ఈ జంట ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేస్తూ ఓ పోస్టు షేర్ చేశారు. అతి త్వరలోనే వీరి ఇంట్లో నవ్వులు విరజిమ్మనునాయి.

డెలివరీ డేట్ ను ప్రకటిస్తూ చేసిన ఆ పోస్టు నెట్టింటా వైరల్ గా మారింది. 2024 సెప్టెంబర్ లో డెలివరీ కాబోతున్నట్లు దీపికా పదుకోన్-రణ్ వీర్ సింగ్ దంపతులు వెల్లడించారు. సెప్టెంబర్ లో తమ మొదటి బిడ్డను పొందనున్నారు ఈ జంట. దీపికా చేసిన పోస్టులో పిల్లలకు సంబంధించిన బట్టలు, షూస్, బెలూన్స్ ఉండడంతో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్లైంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా 2018లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్- దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఈ జంట వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)