iDreamPost
android-app
ios-app

అమిర్ తో విడిపోయి చాలా సంతోషంగా ఉన్నాను: కిరణ్ రావు

  • Published Jul 22, 2024 | 6:29 PM Updated Updated Jul 22, 2024 | 6:29 PM

Aamir khan: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్, డైరెక్టర్ కిరణ్ రావు గత రెండేళ్ల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అమీర్ తో విడిపోయిన తర్వాత కిరణ్ రావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తమ విడాకుల గురించి కానీ, తన వ్యక్తి గత విషయాలను కానీ వెల్లడించలేదు. అయితే తాజాగా మొదటి సారి అమీర్ తో విడిపోయిన తర్వాత జీవితం సంతోషంగా ఉందంటూ కిరణ్ రావు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Aamir khan: బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్, డైరెక్టర్ కిరణ్ రావు గత రెండేళ్ల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక అమీర్ తో విడిపోయిన తర్వాత కిరణ్ రావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తమ విడాకుల గురించి కానీ, తన వ్యక్తి గత విషయాలను కానీ వెల్లడించలేదు. అయితే తాజాగా మొదటి సారి అమీర్ తో విడిపోయిన తర్వాత జీవితం సంతోషంగా ఉందంటూ కిరణ్ రావు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Jul 22, 2024 | 6:29 PMUpdated Jul 22, 2024 | 6:29 PM
అమిర్ తో విడిపోయి చాలా సంతోషంగా ఉన్నాను: కిరణ్ రావు

బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు.. ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మాజీ భార్య అని అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ జంట 2021లో వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన విషయం తెలిసిందే. అయినే సరే ప్రస్తుతం వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అయితే విడిపోయిన తర్వాత ఎవరీ ఫ్రొపెషనల్ లో వారు బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఓ పక్క అమిర్ ఖాన్ ప్ర‌స్తుతం సితారే జమీన్ ప‌ర్ అనే సినిమా చేస్తుండగా.. కిర‌ణ్ రావు ఇటీవ‌ల లాప‌తా లేడిస్ అనే సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా దర్శకురాలు కిరణ్ రావు తాను భర్తతో విడిపోయి చాలా సంతోషంగా ఉన్నంటూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

స్టార్ హీరో అమిర్ ఖాన్ తో విడిపోయిన తర్వాత కిరణ్ రావు ఇప్పటి వరకు ఎక్కడ కూడా తమ విడాకుల గురించి కానీ, తన వ్యక్తి గత విషయాలను కానీ వెల్లడించలేదు. అయితే తాజాగా మొదటి సారి అమీర్ తో విడిపోయిన తర్వాత తన విడాకుల పై స్పందించిన కిరణ్ రావు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా కిరణ్ రావు మాట్లాడుతూ.. ‘అమిర్ తో నేను విడిపోయిన తర్వాత కూడా కుంగిపోలేదు, చాలా  సంతోషంగా ఉన్నాన్నాను.  ఎందుకంటే.. సంబంధాలనేవి ఎప్పటికప్పుడు పునర్నిర్వచించబడాలని నేను భావిస్తున్నా. పైగా మనం పెరిగేకొద్దీ మనుషులుగా మారతుంటాం. ఇకపోతే  సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నప్పుడు నేను చాలా ఎమోషనల్‌, మానసికంగా దానిని తట్టుకోవడానికి కాస్త సమయం పట్టింది.  అలాగే విడాకుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉంటాననుకున్నా.. అలాగే ఉన్నాను.

ఇకపోతే ఆమిర్‌ నా జీవితంలోకి రావడానికి ముందు చాలా ఏళ్లు సింగిల్‌గానే ఉన్నాను. అంతేకాకుండా..  నా స్వతంత్రతాన్ని నేను  ఎంజాయ్‌ చేశాను . కాకపోతే అప్పట్లో కొన్నిసార్లు ఒంటరిగా ఫీలయ్యా కానీ,  ఇప్పుడు అలా కాదు.  ఎందుకంటే.. ఇప్పుడు  నా కొడుకు ఆజాద్‌ నాతో  ఉండటంతో ఒంటరితనం నా దరికి చేరదు. అలాగే  ఇరు కుటుంబాల నుంచి నాకు మంచి సపోర్ట్‌ ఉంది. దాంతో పాటు  ఆమిర్‌తో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉందని’ కిరణ్ రావు చెప్పుకొచ్చారు.  ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి, అమిర్ తో విడిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్ననంటూ కిరణ్ రావు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş