iDreamPost
android-app
ios-app

‘ఖాన్సార్‘లోకి కొత్త హీరోయిన్.. ప్రభాస్ రేంజ్‌కు తగ్గ బ్యూటీ

  • Published Apr 25, 2024 | 3:46 PM Updated Updated Apr 25, 2024 | 3:57 PM

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం సలార్-ది సీజ్ ఫైర్. గత ఏడాది చివరిలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి విదితమే. ఈ ఏడాది సలార్-2 కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే..

ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన చిత్రం సలార్-ది సీజ్ ఫైర్. గత ఏడాది చివరిలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన సంగతి విదితమే. ఈ ఏడాది సలార్-2 కూడా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే..

  • Published Apr 25, 2024 | 3:46 PMUpdated Apr 25, 2024 | 3:57 PM
‘ఖాన్సార్‘లోకి కొత్త హీరోయిన్.. ప్రభాస్ రేంజ్‌కు తగ్గ బ్యూటీ

దాదాపు ఆరేళ్ల తర్వాత కటౌట్ రియల్ కలెక్షన్లు చూపించిన చిత్రం సలార్-ది సీజ్ ఫైర్. ప్రశాంత్ నీల్- డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీసును ఈ మూవీతో షేక్ చేసేశారు. బాలీవుడ్ బాద్ షాతోనే పోటీ పడి టీటౌన్, బీ టౌన్ థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. డార్లింగ్ ప్రభాస్‌ను మాస్ లుక్స్‌లో చూసి మెస్మరైజ్ చెందారు డైహార్ట్ ఫ్యాన్స్. తెరపై యంగ్ రెబల్ స్టార్‌ను చూసుకుని మైమరిచిపోయారు. సలార్ మూవీకి బ్రహ్మరథం పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 700-800 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఎన్నో అనుమానాలతో సినిమా ఎండింగ్ చేసినా.. సలార్-2 శౌర్యాంగ పర్వంలో ఆ చిక్కుముడులను విప్పనున్నాడు దర్శకుడు నీల్. అయితే ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

సలార్-ది సీజ్ ఫైర్ ఇచ్చిన హోప్ అండ్ హైప్‌తో సలార్ 2 కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ ఖాన్సార్‌లోకి మరో హీరోయిన్ రాబోతుందట. తొలి పార్టులో హీరోయిన్ శృతిహాసన్ చుట్టూనే కథ నడుస్తుందన్న సంగతి విదితమే. ఆద్యగా అలరించింది. ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు దేవ (ప్రభాస్). ఇప్పుడు శౌర్యాంగ పర్వంలో మరో బ్యూటీ నటించబోతుందట. ఆల్మోస్ట్ కన్ఫమ్ అయిపోయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. బాలీవుడ్ సోయగం కియారా అద్వానీ. దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి ప్రకటన లేదు.

ఇది నిజమైతే ప్రభాస్ రేంజ్‌కు తగ్గ బ్యూటీ  అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఈ మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు.. ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కియారా .. రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్‌లో నటిస్తుంది. అలాగే ప్రభాస్ కూడా ఇప్పటికే కల్కి పూర్తి చేశాడు. ఇది త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మూవీలో కూడా నటించబోతున్నాడు. ఇది ఈ ఏడాది ఎండింగ్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు దర్శకుడు. వీటితో పాటు హను రాఘవపూడి చిత్రం కూడా ఉంది. అయితే ఈ మధ్యలోనే సలార్ -2 కూడా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈసారి ఖాన్సార్ మరింత ఎరుపెక్కే విధంగా సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss