iDreamPost
android-app
ios-app

తెలుగు సినిమాలు చేసేటప్పుడు ఆ మాటలతో అవమానించారు: కత్రినా కైఫ్‌

  • Published Mar 21, 2024 | 1:48 PM Updated Updated Mar 21, 2024 | 2:14 PM

Katrina Kaif: బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఎంతో సుకుమారంగా అందంగా కనిపించే ఈ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Katrina Kaif: బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఎంతో సుకుమారంగా అందంగా కనిపించే ఈ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

  • Published Mar 21, 2024 | 1:48 PMUpdated Mar 21, 2024 | 2:14 PM
తెలుగు సినిమాలు చేసేటప్పుడు ఆ మాటలతో అవమానించారు: కత్రినా కైఫ్‌

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ‘కత్రినా కైఫ్’ ఒకరు. ఎంతో సుకుమారంగా అందంగా కనిపించే ఈ హీరోయిన్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కాగా, 2003లో ‘బూమ్’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది కత్రినా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించలేకపోయింది. కానీ, కత్రినా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఈ అమ్మాడుకు హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే.. 2005లో సల్మాన్ ఖాన్ నటించిన ‘మైనే ప్యార్ క్యున్ కియా’ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కత్రినా. ఇక ఈ మూవీలో ఈమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.దీంతో ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీలో వెనుదిరిగి చూడలేదు. వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి బయటపెట్టింది.

బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇటీవలే ‘మేరీ క్రిస్మస్’ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇకపోతే ఇటీవలే తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది ఈ బ్యూటీ. ఇక ఆ ఇంటర్వ్యూలో కత్రినా ఏం చెప్పిదంటే.. సినీ కెరీర్‌ ప్రారంభంలో తన డాన్స్‌ గురించి తీవ్రంగా విమర్శించే వారని, అసలు తాను నటిగా కొనసాగే అవకాశమే లేదని చాలామంది ముఖం మీదే చెప్పారని కత్రినా గుర్తు చేసుకుంది. అలాగే ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ అమ్మాయికి డ్యాన్స్‌ రాదని నృత్యదర్శకుడు చెప్పడంతో.. తాను చాలా బాధపడ్డానని పేర్కొంది. అయితే అప్పుడు ఆయన విమర్శలను తాను పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. ఇక ఆయనలా చాలామంది నన్ను ఎదురుగానే నువ్వు సక్సెస్‌ కావు అని విమర్శలు చేశారని చెప్పుకొచ్చింది. అయితే తాను వాటన్నింటినీ సవాలుగా తీసుకుని తనేంటో నిరూపించుకున్న అని పేర్కొంది. కాగా, తనను చాలా తక్కువగా చేసి మాట్లాడిన వారందరితోనే సినిమాలు కూడా చేశానని చెప్పింది. ఇక వారి విమర్నలను పట్టించుకుని ఉంటే తాను ఈ స్థాయికి చేరుకునే దాన్న ికాదని నటి కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది.

He was insulted with those words while making Telugu films

ఇక కత్రినా కైఫ్ . తెలుగులో వెంకటేష్ నటించి ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ, ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. కానీ, హిందీలో మాత్రం చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. కాగా, కత్రినా హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే కత్రినా ప్రెగ్నెంట్ అంటూ పలు రూమర్స్ కూడా వచ్చాయి. కానీ, వాటి పై అటు కత్రినా కానీ, ఇటు విక్కీ కౌశల్ కానీ ఎక్కడ స్పందించ లేదు. మరి, తెలుగు సినిమాలో కత్రినా ఎదుర్కొన్న విమర్శల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş