iDreamPost
android-app
ios-app

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ సిస్టర్.. పోస్ట్ వైరల్

  • Published Jul 08, 2024 | 5:07 PM Updated Updated Jul 08, 2024 | 5:07 PM

బాలీవుడ్ బీటౌన్ బ్యూటీ అనన్య పాండే గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడు సోదరి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని ఆమె సోదరి స్వయంగా తన భర్తతో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ బీటౌన్ బ్యూటీ అనన్య పాండే గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడు సోదరి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని ఆమె సోదరి స్వయంగా తన భర్తతో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Jul 08, 2024 | 5:07 PMUpdated Jul 08, 2024 | 5:07 PM
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ సిస్టర్.. పోస్ట్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ ‘అనన్య పాండే’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే.. ఈ బ్యూటీ తెలుగులో 2022లో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ముఖ్యంగా భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా ప్లాప్ కావడంతో.. అమ్మడుకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కానీ,ఇందులో అనన్య నటనకు మాత్రం ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే పడ్డాయి. ఇకపోతే బాలీవుడ్ లో మాత్రం ఈ బ్యూటీ పలు సినిమాల్లో అలరిస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా.. భారీ ఫ్యాన్ పాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన సోదరికి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 అనన్య సోదరి గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా అనన్య సోదరి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని అనన్య సోదరి సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేస్తూ తెలిపింది.  అనన్య పాండే కజిన్ సిస్టర్ అయిన ‘అలన్నా పాండే’ గత కొన్ని రోజులుగా బేబి  బంప్ ఫోటోస్ ను షేర్ చేస్తూ వస్తున్న విషయ తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మడు పండటి మగ బిడ్డకు జన్మనివ్వగా.. ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా  తన భర్తతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక ఈ పోస్టును కాస్త అనన్య కూడా షేర్ చేస్తూ.. రియాక్ట్ అయ్యింది.  అయితే అనన్య షేర్ చేసిన పోస్టును చూసిపలువురు సినీతారలు, నెటిజన్స్  ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇకపోతే అలన్నా  గతేడాది మార్చిలో ఐవోర్ మెక్‌క్రేని వివాహం చేసుకుంది. అలాగే ముంబయిలోని హోటల్‌లో జరిగిన వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అలన్నా  ఈ ఏడాది ఫిబ్రవరి 28న గర్భం దాల్చినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ఇకపోతే అలన్నా ఒక మోడల్, యూట్యూబర్ కావడం గమన్హారం. అలాగే అలాన్నా ఓ వెబ్ సిరీస్ లో కూడా అలరించిన విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనన్య పోస్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Alanna Panday (@alannapanday)