iDreamPost
android-app
ios-app

అసిస్టెంట్ డైరెక్టర్ తో పెళ్లిపీటలెక్కిన దర్శకుడు! ఫోటోలు వైరల్…

  • Published Jul 01, 2024 | 9:43 PM Updated Updated Jul 01, 2024 | 9:43 PM

Sameer Vidwans: ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కొన్ని జంటలు వివాహబంధంలోకి అడుగు పెట్టగా..ఆ జాబితాలో ఓ దర్శకుడు చేరారు.

Sameer Vidwans: ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కొన్ని జంటలు వివాహబంధంలోకి అడుగు పెట్టగా..ఆ జాబితాలో ఓ దర్శకుడు చేరారు.

  • Published Jul 01, 2024 | 9:43 PMUpdated Jul 01, 2024 | 9:43 PM
అసిస్టెంట్ డైరెక్టర్ తో పెళ్లిపీటలెక్కిన దర్శకుడు! ఫోటోలు వైరల్…

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా..తన ప్రియుడు ఇక్బాల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అలానే జూలై 2వ తేదీన కోలీవుడ్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా వివాహం బంధంలోకి అడుగు పెట్టనుంది. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే.. మరికొందరు పెద్దలు నిశ్చయించిన వారితో వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఓ స్టార్ హీరో పోస్టు చేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవలే బాలీవుడ్ లో ఓ జంట పెళ్లిపీటలెక్కింది. హీరోయిన్ సోనాక్షి సిన్హా, ఇక్బాల్ వివాహం చేసుకున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సమీర్ విద్వాన్స్ కూడ పెళ్లి పీటలెక్కాడు. అసిస్టెంట్ డైరెక్టర్ జూలీ సోనాల్కర్ ను ఆయన మనువాడినాడు. గతేడాది ‘సత్య ప్రేమ్ కి కథ’ సినిమాతో సమీర్ విద్వాన్ మంచి హిట్ అందుకున్నాడు. గతకొంతకాలంగా అసిస్టెంట్ డైరెక్టర్ సోనాల్కర్ తో ప్రేమలో ఉన్నాడు. అలా చాలా కాలం పాటు ప్రేమించుకున్న వీరిద్దరు నేడు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. జూన్ 29 శనివారం మహారాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. తాజాగా  వీరి పెళ్లి రిస్పెషన్ పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అలానే బాలీవుడ్‌ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా నెటినజ్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు విషేష్ తెలిపారు.

ఇక కార్తీక్‌ ఆర్యన్ తన ఇన్‌స్టాలో వీరిద్దరి గురించి రాసుకొచ్చాడు. వారి ప్రేమ ఎలా మొదలైంది అనే విషయాన్ని తన పోస్టులో ప్రస్తావించాడు. ‘ సత్యప్రేమ్ కి కథ’ సినిమా సెట్స్‌లో వారిద్దరి లవ్ స్టోరీని చూశానని కార్తీక్ తెలిపాడు తాజాగా వారి హ్యాపీ జర్నీలో భాగమైనందుకు తనకు ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు. నూతన జంటకు  తన అభినందనలు అంటూ రాసుకొచ్చారు. సత్యప్రేమ్ కి కథ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించారు. ‍అయితే సమీర్ పెళ్లికి హీరోయిన్ కియారా అద్వానీ హాజరు కాలేదు. ఇక సమీర్ విద్వాన్స్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మరాఠీ చిత్రం మహాత్మను తెరకెక్కిస్తున్నారు. ఇక ఆయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetkanyon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş